News September 10, 2025

‘సూపర్ హిట్’ సభకు బాలయ్య దూరం.. కారణమిదే!

image

అనంతపురంలో జరుగుతున్న ‘సూపర్ సిక్స్ సూపర్ హిట్’ సభకు హీరో, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ గైర్హాజరయ్యారు. బాలయ్య జ్వరంతో బాధపడుతున్నారని, అందుకే సభకు రాలేకపోయారని మంత్రి పయ్యావుల కేశవ్ తెలిపారు. మరోవైపు నేపాల్‌లో నెలకొన్న ప్రత్యేక పరిస్థితుల నేపథ్యంలో అక్కడున్న ఆంధ్రులను సురక్షితంగా రాష్ట్రానికి తీసుకురావడంపై దృష్టి సారించడంతో నారా లోకేశ్ సైతం తన పర్యటనను రద్దు చేసుకున్నారు.

Similar News

News December 15, 2025

కామారెడ్డి జిల్లాలో అతి చిన్న సర్పంచ్‌గా యోగిత

image

రెండో విడత గ్రామ పంచాయతీ ఎన్నికలు ముగిశాయి. పలు ప్రాంతాల్లో కౌంటింగ్ ప్రక్రియ రాత్రి వరకు జరిగింది. ఎల్లారెడ్డి మండలం మల్కాపూర్‌కు చెందిన కొండ యోగిత 21 ఏళ్ల వయసులో సర్పంచిగా గెలుపొందారు. తన ప్రత్యర్థిపై 42 ఓట్ల మెజార్టీతో గెలుపొంది జిల్లాలో అతి చిన్న వయస్కురాలైన సర్పంచిగా నిలిచారు. ఆమెకు గ్రామ ప్రజలు అభినందలు తెలిపారు.

News December 15, 2025

300 పోస్టులు.. దరఖాస్తుకు ఇవాళే లాస్ట్ డేట్

image

ఓరియెంటల్ ఇన్సూరెన్స్ కంపెనీ లిమిటెడ్‌లో 300 AO పోస్టులకు అప్లై చేయడానికి ఇవాళే ఆఖరు తేదీ. పోస్టును బట్టి డిగ్రీ/PG, MA ఉత్తీర్ణులైన వారు అప్లై చేసుకోవచ్చు. వయసు 21-30ఏళ్ల మధ్య ఉండాలి. రాత పరీక్ష, ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. నెలకు రూ.85వేలు చెల్లిస్తారు. దరఖాస్తు ఫీజు రూ.1000, SC, ST, PwBDలకు రూ.250. వెబ్‌సైట్: orientalinsurance.org.in/ * మరిన్ని ఉద్యోగాల కోసం <<-se_10012>>జాబ్స్<<>> కేటగిరీకి వెళ్లండి.

News December 15, 2025

జాబ్ చేసుకుంటూ బీటెక్!

image

వర్కింగ్ ప్రొఫెషనల్స్ తమ చదువును కొనసాగించేందుకు AICTE పర్మిషన్ ఇచ్చింది. ఉద్యోగం చేస్తూనే డిప్లొమా, బీటెక్, ఎంటెక్, MBA వంటి కోర్సులు పూర్తి చేసుకునే వెసులుబాటు కల్పించింది. ఇందుకోసం కాలేజీలు ఫ్లెక్సిబుల్ టైమింగ్స్ అమలు చేసుకోవచ్చని సూచించింది. ఈ మేరకు ఆఫీసు వేళల తర్వాత లేదా వీకెండ్స్‌లో క్లాసులకు హాజరుకావచ్చు. ఇప్పటికే ఈ విధానం కొన్నిచోట్ల అమల్లో ఉండగా, ఇకపై పూర్తిస్థాయిలో అందుబాటులోకి రానుంది.