News February 10, 2025

సూర్యాపేటలో మహిళతో సహజీవనం.. కుమార్తెలపై అత్యాచారం

image

సూర్యాపేటలో ప్రభుత్వ టీచర్ ఓ మహిళతో సహజీవనం చేస్తూ ఆమె కుమార్తెలపై అత్యాచారానికి ఒడిగట్టాడు. పోలీసుల వివరాలిలా.. మామిళ్లగడ్డ పాఠశాలలో విధులు నిర్వహిస్తున్న అతను భార్యతో దూరంగా ఉంటూ 2018 నుంచి మరో మహిళతో సహజీవనం చేస్తున్నాడు. అతని కన్ను ఆమె కుమార్తెలపై పడింది. వారికి మత్తు ఇచ్చి పలుమార్లు అత్యాచారం చేశాడు. ఈ క్రమంలో ఓసారి మహిళ చూసి ఈ నెల 5న పోలీసులకు ఫిర్యాదు చేయగా పోక్సో కేసు నమోదు చేశారు.

Similar News

News February 13, 2026

నల్గొండలో విషాదం.. డీసీఎం ఢీకొని కానిస్టేబుల్‌ మృతి

image

చందనపల్లిలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. చందనపల్లి సమీపంలో వేగంగా వచ్చిన డీసీఎం వ్యాన్, ద్విచక్ర వాహనాన్ని బలంగా ఢీకొనడంతో మునుగోడు పోలీస్ స్టేషన్‌లో పనిచేస్తున్న కానిస్టేబుల్ షేక్ తయ్యుబ్ (34) అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. ​ఎన్నికల విధులను ముగించుకుని నకిరేకల్ వైపు వెళ్తుండగా ఈ ప్రమాదం సంభవించింది. మృతుడికి ఇద్దరు చిన్న పిల్లలు ఉన్నట్లు సమాచారం. ప్రమాద ధాటికి బైక్ నుజ్జునుజ్జయింది.

News February 13, 2026

మిర్యాలగూడలో ఒక్క ఓటుతో విజయం

image

మిర్యాలగూడ 18వ వార్డులో కాంగ్రెస్ అభ్యర్థి బూడిద సైదులు సంచలన విజయం సాధించారు. అత్యంత హోరాహోరీగా సాగిన కౌంటింగ్‌లో సైదులుకు 837 ఓట్లు రాగా, సమీప బీఆర్ఎస్ అభ్యర్థికి 836 ఓట్లు పోలయ్యాయి. కేవలం ఒక్క ఓటు మెజారిటీతో ఆయన గెలుపొందారు. ఈ ఉత్కంఠ విజయంతో అభిమానులు సంబరాల్లో మునిగిపోయారు. వార్డు అభివృద్ధికి నిరంతరం అందుబాటులో ఉంటానని సైదులు కృతజ్ఞతలు తెలిపారు.

News February 13, 2026

దేవరకొండ: మున్సిపల్ పీఠం కాంగ్రెస్ కైవసం

image

దేవరకొండ మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రభంజనం సృష్టించింది. మొత్తం 20 వార్డులకు గాను 11 స్థానాలను గెలుచుకుని, స్పష్టమైన మెజార్టీతో మున్సిపల్ పీఠాన్ని దక్కించుకుంది. ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ 6 స్థానాలకే పరిమితం కాగా, బీజేపీ కేవలం ఒక వార్డులో మాత్రమే విజయం సాధించింది. ఓటర్లు మార్పు కోరుకుంటూ కాంగ్రెస్ వైపు మొగ్గు చూపడంతో పట్టణంలో పార్టీ శ్రేణులు బాణసంచా కాల్చి భారీ ఎత్తున సంబరాలు జరుపుకున్నారు.