News September 10, 2025
సూర్యాపేట అదనపు కలెక్టర్‌గా సీతారామరావు

సూర్యాపేట జిల్లా అదనపు కలెక్టర్ (రెవెన్యూ)గా కె.సీతారామరావు నియమితులయ్యారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుతం నల్గొండ జిల్లాలో స్పెషల్ కలెక్టర్‌గా పనిచేస్తున్న ఆయన, ఇటీవలే పదవీ విరమణ చేసిన అదనపు కలెక్టర్ రాంబాబు స్థానంలో బాధ్యతలు చేపట్టనున్నారు.
Similar News
News December 11, 2025
కడప YVUలో ప్రవేశానికి దరఖాస్తులు

కడప YVU పరిధిలోని అనుబంధ కళాశాలల్లో నాలుగో సంవత్సరంలో ప్రవేశానికి దరఖాస్తులను స్వీకరిస్తున్నట్లు వైవియూ డైరెక్టర్ డా. టి. లక్ష్మిప్రసాద్ తెలిపారు. ఈ నెల 12 నుంచి 18వ తేదీ వరకు దరఖాస్తులు స్వీకరిస్తామని చెప్పారు. మూడు సంవత్సరాల డిగ్రీ పూర్తి చేసుకున్న విద్యార్థులు నాలుగు సంవత్సరాల యు.జి కోర్సుకు అర్హులు. వివరాల కోసం www.yvu.edu.in ను సంప్రదించవచ్చు.
News December 11, 2025
మేయర్, ఎంపీపీ స్థానాలు వైసీపీకే: రవీంద్రనాథ్ రెడ్డి

ఎన్ని ప్రయత్నాలు చేసినా చివరకు న్యాయమే గెలిచిందని వైసీపీ జిల్లా అధ్యక్షుడు రవీంద్రనాథ్ రెడ్డి అన్నారు. గురువారం ఆయన జిల్లా పార్టీ కార్యాలయంలో మాట్లాడుతూ.. కడప నగర మేయర్‌తో పాటు ముద్దనూరు ఎంపీపీ స్థానాన్ని కూడా వైసీపీ కైవసం చేసుకుందన్నారు. కూటమి ప్రభుత్వం రైతులకు చేసింది ఏమీ లేదన్నారు. మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణ వల్ల పేద విద్యార్థులకు వైద్య విద్య దూరమవుతుందని ఆందోళన వ్యక్తం చేశారు.
News December 11, 2025
గురుకుల స్కూళ్ల ప్రవేశాలకు నోటిఫికేషన్

TG: SC, ST, BC, జనరల్ గురుకుల పాఠశాలల్లో 2026-27లో ప్రవేశాలకు ప్రభుత్వం నోటిఫికేషన్ జారీచేసింది. ఈ ఇంగ్లిష్ మీడియం స్కూళ్లలో 5, 6, 9వ తరగతుల్లో చేరికలకు 2026 FEB 22న ఉదయం 11 నుంచి ఒంటిగంట వరకు అన్ని జిల్లాల్లో ప్రవేశ పరీక్ష జరుగుతుందని ప్రకటించింది. అభ్యర్థులు ఆన్‌లైన్‌లో JAN 21 వరకు దరఖాస్తులు సమర్పించవచ్చని తెలిపింది. ప్రాస్పెక్టస్ వివరాలకు ‘https://tgcet.cgg.gov.in’ సందర్శించవచ్చని సూచించింది.


