News March 27, 2024
‘సూర్యాపేట’ ఇక కనుమరుగేనా..?

రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రావడంతో మళ్లీ జిల్లాల పునర్‌వ్యవస్థీకరణ అంశం తెర మీదకు వచ్చింది. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో నల్లగొండ జిల్లాను మూడు జిల్లాలుగా విభజించిన విషయం తెలిసిందే. ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం ఒక్కో పార్లమెంట్ నియోజకవర్గాన్ని ఒక జిల్లాగా చేయనున్నట్లు తెలుస్తోంది. జిల్లాల కుదింపులో సూర్యాపేట జిల్లా తొలగించనున్నట్లు విశ్వసనీయ సమాచారం.
Similar News
News February 10, 2026
నల్గొండ: పుర పోరులో.. పెరిగిన ఓటు విలువ!

మున్సిపల్ ఎన్నికల్లో ప్రచార పర్వం ముగియడంతో తాయిలాల పంపిణీకి తెరలేచింది. అభ్యర్థులు ఎలాగైనా గెలవాలనే లక్ష్యంతో రూ.లక్షలు కుమ్మరిస్తుండడంతో ఓటు విలువ పెరిగింది. జిల్లాలో నల్గొండ కార్పొరేషన్ సహా మిర్యాలగూడ, హాలియా, చండూర్, దేవరకొండ, చిట్యాల, నందికొండ మున్సిపాల్టీల్లో భారీగా ఖర్చు చేస్తున్నట్లు తెలుస్తోంది. నల్గొండలో ఒక్కో డివిజన్‌లో రూ.50 లక్షల పైగానే డబ్బు పంపిణీ చేస్తున్నట్లు సమాచారం.
News February 10, 2026
ఎన్నికలు శాంతియుతంగా జరిగేందుకు సహకరించాలి: నల్గొండ ఎస్పీ

మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో జిల్లా పోలీస్ యంత్రాంగం అత్యంత అప్రమత్తమైంది. జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ ఆధ్వర్యంలో కట్టుదిట్టమైన నాకాబందీ చేపట్టారు. 48 గంటల ‘మౌన కాలం’ అమల్లోకి రావడంతో ప్రచారాలు, సభలపై నిషేధం విధించారు. సెక్షన్ 163 అమలు చేస్తూ అక్రమ నగదు, మద్యం తరలింపుపై ప్రత్యేక నిఘా ఉంచారు. ఎన్నికలు శాంతియుతంగా జరిగేందుకు ప్రజలు సహకరించాలని ఎస్పీ కోరారు.
News February 9, 2026
NLG: మున్సిపల్ పోలింగ్.. రెండు రోజులు సెలవులు: కలెక్టర్

మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో జిల్లాలోని ఆయా మున్సిపాలిటీల పరిధిలోని అన్ని విద్యాసంస్థలకు ఈ నెల 10, 11 తేదీల్లో రెండు రోజుల పాటు సెలవు ప్రకటించినట్లు కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి బి. చంద్రశేఖర్ తెలిపారు. ఈ ఉత్తర్వులు నల్గొండ కార్పొరేషన్, మిర్యాలగూడ, హాలియా, నందికొండ, చండూరు, దేవరకొండ, చిట్యాల మున్సిపాలిటీలకు వర్తిస్తాయని పేర్కొన్నారు.


