News January 25, 2025

సూర్యాపేట: గ్రామ సభలు విజయవంతంగా పూర్తి

image

ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇందిరమ్మ ఇండ్లు, రేషన్ కార్డులు, రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా ప్రజాపాలన గ్రామ సభలు విజయవంతంగా నిర్వహించామని జిల్లా కలెక్టర్ తేజస్ నందు లాల్ పవర్ అన్నారు. జిల్లా వ్యాప్తంగా 813 రైతు భరోసా, 5498 ఆత్మీయ భరోసా, 7015 రేషన్ కార్డుల 8760 మంది ఇందిరమ్మ ఇండ్ల కొరకు లబ్ధిదారులు దరఖాస్తులు చేసుకున్నట్లు తెలిపారు.

Similar News

News February 10, 2025

ఇందిరమ్మ ఇళ్లకు ఉచితంగా ఇసుక: సీఎం

image

TG: ఇందిరమ్మ ఇళ్లకు ఉచితంగా ఇసుక సరఫరా చేయాలని CM రేవంత్ అధికారులను ఆదేశించారు. వినియోగదారులకు తక్కువ ధరకే ఇసుక లభించేలా చూడాలన్నారు. బ్లాక్ మార్కెట్‌ను అరికట్టి పేదలకు ఇసుక అందుబాటులో ఉంచాలని స్పష్టం చేశారు. ఇసుక మాఫియాపై అధికారులు ఉక్కుపాదం మోపాలని, అక్రమ రవాణా చేస్తే ఎంతటి వారినైనా ఉపేక్షించేది లేదని తేల్చి చెప్పారు. ఇసుక అక్రమ రవాణా అడ్డుకట్ట బాధ్యతను కలెక్టర్లు, ఎస్పీలకు ఇవ్వాలని సూచించారు.

News February 10, 2025

నిర్మల్ జిల్లాలో నేటి టాప్ న్యూస్

image

1.నిర్మల్: నిర్మల్ జిల్లాకు త్రిపుర గవర్నర్ ఇంద్రసేనారెడ్డి2.లోకేశ్వరం: ఫోన్ విషయంలో గొడవ.. చెరువులో దూకిన మహిళ3.లక్ష్మణాచంద మండలంలో 75,281 ధాన్యం సంచులు మాయం4.భైంసాలో 40 టన్నుల పీడీఎస్ బియ్యం సీజ్5.కుబీర్‌లో రోడ్డు ప్రమాదం.. ఇద్దరికి గాయాలు6.నిర్మల్ : బస్ డిపో వద్ద ఆటో బోల్తా ఒకరికి తీవ్ర గాయాలు

News February 10, 2025

పోలింగ్ స్టేషన్లపై అభ్యంతరాలుంటే చెప్పండి: అడిషనల్ కలెక్టర్

image

మెదక్ మండలం రాజ్‌పల్లి, హవేలీఘన్పూర్ మండలం మద్దుల్వాయి గ్రామాల్లో పోలింగ్ స్టేషన్ల ఏర్పాటుపై అభ్యంతరాలుంటే తెలపాలని వివిధ రాజకీయ పార్టీ ప్రతినిధులకు అదనపు కలెక్టర్ నగేష్ సూచించారు. సోమవారం గ్రామాల పోలింగ్ స్టేషన్ల ఏర్పాటులో భాగంగా వివిధ రాజకీయ పార్టీ ప్రతినిధుల అభ్యంతరాలపై సమీక్షించారు. మద్దుల్వాయి, రాజ్‌పల్లి పోలింగ్ స్టేషన్ల డ్రాఫ్ట్ విడుదల చేశామన్నారు.

error: Content is protected !!