News August 21, 2025
సూర్యాపేట: జాన్‌పహాడ్ పంచాయతీ కార్యదర్శి అరెస్ట్

జాన్‌పహాడ్ గ్రామ పంచాయతీ కార్యదర్శి ఇంజమూరి వెంకయ్యను గురువారం ఏసీబీ డీఎస్పీ బాలకృష్ణ ఆధ్వర్యంలో అరెస్ట్ చేశారు. డీఎస్పీ మాట్లాడుతూ.. ఇందిరమ్మ ఇళ్ల మంజూరులో పంచాయతీ కార్యదర్శి లబ్ధిదారుల నుంచి డబ్బులు డిమాండ్ చేసిన నేపథ్యంలో విచారించి, ఆయనపై కేసు నమోదు చేశామన్నారు. అనంతరం హైదరాబాద్‌లోని నాంపల్లి ఏసీబీ కోర్టులో హాజరుపరిచినట్లు తెలిపారు.
Similar News
News January 18, 2026
హైదరాబాద్‌పై NTR చెరగని ముద్ర

HYDపై మాజీ CM దివంగత NTR చెదరని ముద్ర వేశారు. ట్యాంక్‌బండ్‌లో మనం చూసే బుద్ధ విగ్రహం ఆయన ఆలోచనలోనుంచే పుట్టింది. ఇందులో 1990 మార్చి 10న ప్రపంచంలోనే ఎత్తైన ఏకశిలా బుద్ధ విగ్రహ తొలి ప్రతిష్ఠ విషాదంగా మారింది. అనంతరం 1992లో విజయవంతంగా ప్రతిష్ఠించగా, నేడు అది HYDకు ప్రతీకగా నిలుస్తోంది. సాగరతీరం సౌందర్యవృద్ధికి 1996లో నెక్లెస్ రోడ్డును రూపుదిద్దారు. నేడు ఆయన వర్ధంతి సందర్భంగా HYD ఆయనను స్మరిస్తోంది.
News January 18, 2026
రాజకీయం ఇప్పుడే మొదలైంది: శివసేన(UBT)

ముంబై మున్సిపల్ ఎన్నికల ఫలితాల తర్వాత ‘రిసార్ట్ రాజకీయం’ మొదలైన తరుణంలో శివసేన (UBT) కీలక వ్యాఖ్యలు చేసింది. ‘ఎన్నికలు ముగిశాయి. ఫలితాలు వచ్చాయి. అసలైన రాజకీయం ఇప్పుడే మొదలవుతుంది’ అని సామ్నా ఎడిటోరియల్‌లో పేర్కొంది. ముంబైకి ఇప్పటివరకు 23 మంది మరాఠీ మేయర్లను అందించిన సంప్రదాయం కొనసాగుతుందా అని ప్రశ్నించింది. మేయర్ ఎంపిక విషయంలో CM ఫడణవీస్, Dy.CM షిండే మధ్య అంతర్గత పోరు నడుస్తోందని రాసుకొచ్చింది.