News December 1, 2025

‘సూర్యాపేట జిల్లాకు భీమిరెడ్డి నరసింహారెడ్డి పేరు పెట్టాలి’

image

పోరాటాల పురిటిగడ్డ సూర్యాపేట జిల్లా కేంద్రంగా వీర తెలంగాణ సాయుధ పోరాటం సాగిందని, పోరాట చరిత్రకు సాక్షిగా నిలబడ్డ భీమిరెడ్డి నరసింహారెడ్డి పేరు సూర్యాపేట జిల్లాకు పెట్టాలని ఎంసీపీఐయూ జిల్లా నాయకులు అదనపు కలెక్టర్‌కు వినతి పత్రం అందజేశారు. అనంతరం వర్గ సభ్యులు వెంకన్న, నజీర్ మాట్లాడుతూ.. పాతికేళ్ల పార్లమెంటరీ ఉద్యమ సారథిగా బీఎన్ రాష్ట్రపతి అవార్డు పొందారన్నారు.

Similar News

News February 13, 2026

BREAKING: నర్సాపూర్‌లో హంగ్

image

మెదక్ జిల్లా నర్సాపూర్‌లో హంగ్ ఏర్పడింది. ఇక్కడ మొత్తం 15 వార్డులకు గాను కాంగ్రెస్ 6, BRS 5, బీజేపీ 4 వార్డులు గెలిచాయి. మ్యాజిక్ ఫిగర్ సంఖ్య 8 ఎవరూ సాధించకపోవడంతో హంగ్ ఏర్పడింది. దీంతో ఉమ్మడి మెదక్ జిల్లా ప్రజలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

News February 13, 2026

కొచ్చిన్ పోర్ట్ అథారిటీలో ఉద్యోగాలు

image

కొచ్చిన్ పోర్ట్ అథారిటీ 5 పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. అర్హతగల వారు మార్చి 10 వరకు అప్లై చేసుకోవచ్చు. పోస్టును బట్టి BTech/BE (సివిల్ ఇంజినీరింగ్) అర్హతతో పాటు పని అనుభవం ఉండాలి. Sr. ప్రాజెక్ట్ కన్సల్టెంట్‌కు నెలకు రూ.65వేలు, ప్రాజెక్ట్ కన్సల్టెంట్‌కు రూ.55వేలు చెల్లిస్తారు. షార్ట్ లిస్టింగ్, ఇంటర్వ్యూ, DV ద్వారా ఎంపిక చేస్తారు. వెబ్‌సైట్: https://www.cochinport.gov.in

News February 13, 2026

ములుగు మున్సిపాలిటీ కాంగ్రెస్ కైవసం!

image

ములుగు మున్సిపాలిటీ కాంగ్రెస్ కైవసం అయ్యింది. మొత్తం 20 వార్డులకు గాను కాంగ్రెస్ అత్యధికంగా 12 వార్డుల్లో విజయం సాధించింది. బీఆర్ఎస్ 5 వార్డుల్లో గెలుపొందగా, ఇండిపెండెంట్ అభ్యర్థులు 2 వార్డుల్లో విజయం సాధించారు. బీజేపీ 1 వార్డులో గెలిచి తన ఉనికిని చాటింది.