News November 16, 2025

సూర్యాపేట జిల్లాలో 25 వేల మంది దరఖాస్తుదారులు

image

చేయూత పింఛన్ల కోసం వృద్ధులు, దివ్యాంగులు ఆశగా ఎదురుచూస్తున్నారు. వివిధ కేటగిరీలకు చెందిన లబ్ధిదారులు మీసేవ కేంద్రాల ద్వారా దరఖాస్తులు సమర్పించారు. సూర్యాపేట జిల్లాలో సుమారు 25 వేల దరఖాస్తులు మండల పరిషత్ కార్యాలయాల్లో పెండింగ్‌లో ఉన్నాయి. ప్రభుత్వం వెంటనే స్పందించి, పెండింగ్‌లో ఉన్న కొత్త పింఛన్లను మంజూరు చేయాలని దరఖాస్తుదారులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు.

Similar News

News January 23, 2026

శాఖల ఖాళీల వివరాలు వెంటనే సమర్పించాలి: పెద్దపల్లి కలెక్టర్

image

పెద్దపల్లిలో పరిపాలన అంశాలపై శుక్రవారం జిల్లా అధికారులతో కలెక్టర్ కోయ శ్రీ హర్ష సమీక్ష నిర్వహించారు. ప్రతి శాఖలో ఖాళీల వివరాలు, ఇంట్రెస్ట్ ఫండ్స్, మెడికల్ రీయింబర్స్‌మెంట్ పెండింగ్ ప్రతిపాదనలు క్లియర్ చేయాలన్నారు. అభివృద్ధి కార్యక్రమాల్లో ప్రజాప్రతినిధులను ఆహ్వానించాలని, కోర్టు కేసుల వివరాలు జనవరి 28కి ఆన్‌లైన్‌లో నమోదు చేయాలని సూచించారు. కార్యాలయాల్లో పాత సామాన్లు, కంప్యూటర్లను తొలగించాలన్నారు.

News January 23, 2026

నేషనల్ సెంటర్ ఫర్ ఎర్త్ సైన్స్ స్టడీస్‌లో ఉద్యోగాలు

image

<>నేషనల్<<>> సెంటర్ ఫర్ ఎర్త్ సైన్స్ స్టడీస్ 3 జూనియర్ టెక్నీషియన్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. టెన్త్/ఐటీఐ అర్హత గలవారు ఫిబ్రవరి 10 వరకు అప్లై చేసుకోవచ్చు. అభ్యర్థుల గరిష్ఠ వయసు 30ఏళ్లు. రిజర్వేషన్ గలవారికి ఏజ్‌లో సడలింపు ఉంది. రాత పరీక్ష ద్వారా ఎంపిక చేస్తారు. బేసిక్ పే రూ.18000-రూ.56,900. వెబ్‌సైట్: https://www.ncess.gov.in

News January 23, 2026

ఆర్థిక సంస్థల కేంద్రంగా అమరావతి: CBN

image

AP: వ్యవసాయంతో పాటు రెన్యూవబుల్ ఎనర్జీ సంస్థలకూ అధిక రుణాలివ్వాలని CM CBN బ్యాంకర్ల సమావేశంలో సూచించారు. డిస్కంలు కూడా కౌంటర్ గ్యారంటీ ఇస్తున్నాయని చెప్పారు. ‘అమరావతిని ఆర్థిక సంస్థల కేంద్రంగా మారుస్తున్నాం. 15 బ్యాంకుల ప్రధాన కార్యాలయాలు ఏర్పాటవుతున్నాయి. డ్వాక్రా సంఘాల ఖాతాలపై వేస్తున్న 15 రకాల ఛార్జీలను తగ్గించాలి. ఫార్మర్ ప్రొడ్యూసర్స్ ఆర్గనైజేషన్స్‌ను ప్రోత్సహించాలి’ అని పేర్కొన్నారు.