News April 13, 2025
సూర్యాపేట జిల్లాలో 30 పోలీస్ యాక్ట్: ఎస్పీ

ప్రజల భద్రత, శాంతిభద్రతల దృష్ట్యా సూర్యాపేట జిల్లాలో 30 పోలీస్ యాక్ట్ అమలులో ఉంటుందని ఎస్పీ నరసింహ తెలిపారు. పోలీసుల ముందస్తు అనుమతి లేకుండా సభలు, సమావేశాలు, ర్యాలీలు నిర్వహించరాదని సూచించారు. తప్పనిసరిగా పోలీసుల అనుమతి తీసుకోవాలనీ అనుమతులు లేకుండా ఇలాంటి కార్యక్రమాలు నిర్వహిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామన్నారు. జిల్లా వ్యాప్తంగా DJలను పూర్తిగా నిషేధించామన్నారు.
Similar News
News January 15, 2026
సంగారెడ్డి: CHICKEN కోసం వెళ్లి మృతి

మాంజా తగిలి <<18856381>>వ్యక్తి మృతి<<>> చెందిన సంఘటన సంగారెడ్డిలో బుధవారం చోటుచేసుకున్న విషయం తెలిసిందే. ఎస్ఐ మధుసూదన్ రెడ్డి కథనం ప్రకారం.. ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి చెందిన అనుదీప్ (38) వరి కోతలు కోసేందుకు పసల్వాదికి వచ్చాడు. చికెన్ తీసుకురావడానికి సంగారెడ్డికి బైక్‌పై వెళ్లాడు. తిరిగి వస్తుండగా మాంజా మెడపై తగిలి మరణించాడు. అనుదీప్ మెడకు తగిలింది చైనా మాంజా కాదని, మామూలుదేనని ఎస్ఐ తెలిపారు.
News January 15, 2026
KNR: సంక్రాంతి, మేడారం ఎఫెక్ట్.. మేకలకు భలే గిరాకీ!

సంక్రాంతి, మేడారం జాతర సందర్భంగా ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా మేకలు, గొర్రెలకు భారీగా డిమాండ్ పెరిగింది. గురువారం మంథనిలోని ఫ్లైఓవర్ వంతెన సమీపంలో వ్యాపారులు మేకల విక్రయ కేంద్రాలను ఏర్పాటు చేశారు. అయితే వ్యాపారులు అధిక రేట్లు వసూలు చేస్తున్నారని కొనుగోలుదారులు వాపోతున్నారు. మరోవైపు, ప్రధాన రహదారిపైనే విక్రయాలు జరగడంతో రాకపోకలకు అంతరాయం కలుగుతోందని వాహనదారులు చెబుతున్నారు.
News January 15, 2026
యాదాద్రి భువనగిరి మున్సిపల్ రిజర్వేషన్లు ఇవే..

1.భువనగిరి 35: ST 1,SC 5, BC 11, UR 18.
2.ఆలేరు 12: ST 1,SC 2, BC 3, UR 6.
3.చౌటుప్పల్ 20: ST 1,SC 3, BC 6, UR 10.
మోత్కూర్ 12: ST 1,SC 2, BC 3, UR 6.
పోచంపల్లి 13: ST 1,SC 1, BC 4, UR 7.
యాదగిరిగుట్ట 12: ST 1,SC 1, BC 4, UR 6.


