News November 19, 2025

సూర్యాపేట జిల్లా వాసికి అంతర్జాతీయ గుర్తింపు

image

హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయం విద్యా విభాగానికి చెందిన డా.రావుల కృష్ణయ్య పరిశోధక విద్యార్థిని సాక్షి సంయుక్తంగా చేసిన పరిశోధనకు అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు లభించింది. వారు రూపొందించిన పరిశోధనా పత్రం, జర్మన్ కమిషన్ ఫర్ యునెస్కో, జర్మన్ రెక్టర్స్ కాన్ఫరెన్స్ సంయుక్తంగా జర్మనీలోని హానోవర్‌లో నవంబర్ 19-21 మధ్య నిర్వహించనున్న అంతర్జాతీయ సదస్సులో సమర్పణకు ఎంపికైంది.

Similar News

News January 16, 2026

ధురంధర్ నటికి చేదు అనుభవం

image

BMC ఎన్నికల్లో ధురంధర్ నటి సౌమ్యా టాండన్‌కు చేదు అనుభవం ఎదురైంది. షూటింగ్‌కు సెలవు పెట్టి మరీ నిన్న ఓటు వేయడానికి వెళ్లారు. అయితే అధికారులు దాల్మియా కాలేజ్‌ బూత్‌లో వివరాల్లేవని ఆమెను మరో బూత్‌కు పంపడంతో అసహనం వ్యక్తం చేశారు. ‘ఓటు వేయడం నా హక్కు, బాధ్యత. ముందే స్క్రీన్ షాట్ తీసుకున్నా.. ఈ గందరగోళం ఏంటి? అసలు లిస్ట్‌లో నా పేరుందో లేదో చూడాలి’ అన్నారు. చివరకు ఓటేశారా లేదా అనే దానిపై స్పష్టతలేదు.

News January 16, 2026

చిత్తూరులో జనాభా లెక్కలు ఎప్పటి నుంచో తెలుసా?

image

చిత్తూరు జిల్లాలో జన గణననకు అధికారులు పకడ్బందీ ఏర్పాట్లు చేపడుతున్నారు. కలెక్టర్ ఇటీవల సమావేశం ఏర్పాటు చేసి తాను ముఖ్య జన గణన అధికారిగా ఉంటానని వెల్లడించారు. ఇతర శాఖ అధికారులకు బాధ్యతలు అప్పగించారు. జిల్లాలో సుమారు ఆరు లక్షల గృహాలు ఉండగా.. 2011 లెక్కల ప్రకారం18 లక్షల మంది జనాభా ఉన్నారు. ప్రత్యేక యాప్ ద్వారా ఏప్రిల్ ఒకటి నుంచి జన గణన చేసేందుకు అధికారులు సిద్ధమవుతున్నారు.

News January 16, 2026

ADB: 18న కొమురం భీమ్ స్టడీ సర్కిల్ ప్రవేశ పరీక్ష

image

కొమురం భీమ్ స్టడీ సర్కిల్ HYD 2026-27 విద్యా సంవత్సరానికిగాను ఈనెల 18న ప్రవేశ పరీక్ష నిర్వహించనుంది. ASFలోని స్టడీ సర్కిల్, ఆదిలాబాద్ జిల్లా లింగపూర్‌లోని ఏకలవ్య టీఆర్‌సీ కేంద్రాల్లో పరీక్షలు జరుగుతాయని నిర్వాహకులు తెలిపారు. మెయిల్ ద్వారా సమాచారం అందుకున్న అభ్యర్థులు మాత్రమే ప్యాడ్, పెన్నులతో హాజరుకావాలని సూచించారు. అభ్యర్థులకు పరీక్షా కేంద్రాల వద్ద భోజన సదుపాయం కల్పించనున్నట్లు పేర్కొన్నారు.