News November 19, 2025
సూర్యాపేట జిల్లా వాసికి అంతర్జాతీయ గుర్తింపు

హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయం విద్యా విభాగానికి చెందిన డా.రావుల కృష్ణయ్య పరిశోధక విద్యార్థిని సాక్షి సంయుక్తంగా చేసిన పరిశోధనకు అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు లభించింది. వారు రూపొందించిన పరిశోధనా పత్రం, జర్మన్ కమిషన్ ఫర్ యునెస్కో, జర్మన్ రెక్టర్స్ కాన్ఫరెన్స్ సంయుక్తంగా జర్మనీలోని హానోవర్‌లో నవంబర్ 19-21 మధ్య నిర్వహించనున్న అంతర్జాతీయ సదస్సులో సమర్పణకు ఎంపికైంది.
Similar News
News January 22, 2026
కాసేపట్లో కేసీఆర్‌ను కలవనున్న కేటీఆర్, హరీశ్

TG: ఫోన్ ట్యాపింగ్ కేసులో నోటీసుల నేపథ్యంలో మాజీ CM KCRతో KTR, హరీశ్ రావు భేటీ కానున్నారు. కాసేపట్లో వారిద్దరూ ఎర్రవల్లిలోని ఫామ్‌హౌస్‌కు వెళ్లనున్నారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో ఎలా ముందుకెళ్లాలనే దానిపై గులాబీ బాస్‌తో చర్చించనున్నారు. ఇప్పటికే హరీశ్‌ను సిట్ విచారించగా రేపు రావాలని KTRకు నోటీసులు ఇచ్చింది. దీనిపై సాయంత్రం 6 గంటలకు సిరిసిల్ల తెలంగాణ భవన్‌లో కేటీఆర్ ప్రెస్‌మీట్ పెట్టనున్నారు.
News January 22, 2026
భద్రాచలం: ఐటీడీఏ ఉద్యోగులకు ఈనెల 23న క్రీడా పోటీలు

భద్రాచలం ఐటీడీఏ పరిధిలో పనిచేసే ఉద్యోగులు, ఉపాధ్యాయులకు మొట్టమొదటిసారిగా వివిధ క్రీడా పోటీలు నిర్వహిస్తున్నట్లు ఐటీడీఏ పీఓ రాహుల్ గురువారం తెలిపారు. ఈనెల 23, 24వ తేదీల్లో కిన్నెరసానిలోని ప్రభుత్వ మోడల్ క్రీడా పాఠశాలలో నిర్వహించనున్నట్లు ఆయన అన్నారు. శారీరక ఉల్లాసం పొందడం, పని ఒత్తిడి తగ్గించడం, ఉద్యోగి ఆరోగ్యంగా ఉండడంతోపాటు ఐక్యత స్నేహభావం కలిగి ఉండడానికి క్రీడలు దోహదపడతాయన్నారు.
News January 22, 2026
విశాఖ: ఫిబ్రవరిలో ఆర్సెల్లార్ స్టీల్‌ప్లాంట్‌కు శంకుస్థాపన

అనకాపల్లి(D) నక్కపల్లిలో ఏర్పాటు చేయనున్న ఆర్సెల్లార్ మిట్టల్ నిప్పాన్ స్టీల్ ప్లాంట్‌కు ఫిబ్రవరి 15 తర్వాత శంకుస్థాపన చేయనున్నట్టు సీఎం చంద్రబాబు తెలిపారు. దావోస్‌లో జరుగుతున్న వరల్డ్ ఎకనమిక్ ఫోరం సందర్భంగా ఆర్సెల్లార్ మిట్టల్ నిప్పాన్ స్టీల్ ఎగ్జిక్యూటివ్ ఛైర్మన్ లక్ష్మీ మిట్టల్తో సీఎం భేటీ అయ్యారు. రూ.60 వేల కోట్ల పెట్టుబడితో ప్లాంట్ ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు.


