News November 30, 2025

సూర్యాపేట: ప్రారంభమైన రెండో విడత నామినేషన్లు

image

సూర్యాపేట జిల్లా స్థానిక సంస్థల ఎన్నికల్లో రెండో విడత నామినేషన్ ప్రక్రియ ప్రారంభమైంది. జిల్లాలోని 8 మండలాలకు చెందిన 181 గ్రామపంచాయతీలు, 1,628 వార్డుల కోసం అభ్యర్థులు నామినేషన్‌లు స్వీకరించనున్నారు. నామినేషన్ వేసే కేంద్రాల్లో అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించేలా భద్రతా చర్యలు కట్టుదిట్టం చేశారు.

Similar News

News February 9, 2026

జగిత్యాల: ఎస్సారెస్పీ కెనాల్‌లో మృతదేహం లభ్యం

image

జగిత్యాల (R) మండలం నర్సింగాపూర్ గ్రామంలోని ఎస్సారెస్పీ కెనాల్‌లో మృతదేహం లభ్యమైంది. జగిత్యాల పట్టణంలోని టీఆర్ నగర్‌కు చెందిన షేక్ నయీమ్ (43) గత కొన్ని నెలలుగా మద్యానికి బానిసయ్యాడు. భార్యతో తరచూ గొడవలు జరగగా తల్లి వద్దనే ఉంటున్నాడు. ఈనెల 6న ఇంట్లో నుంచి బయటకు వెళ్లిన నయీమ్ తిరిగి రాకపోవడంతో జగిత్యాల రూరల్ పోలీసులకు తల్లి ఫిర్యాదు చేసింది. ఆదివారం నయీం శవం లభ్యమైంది.

News February 9, 2026

GWL: ఎన్నికల విధులకు ఎంతమంది పోలీసులంటే?

image

ఈనెల 11న గద్వాల జిల్లాలో జరిగే మూడు మున్సిపాలిటీల్లో జరిగే ఎన్నికల విధులకు 375 మంది పోలీస్ సిబ్బందిని నియమించినట్లు ఎస్పీ శ్రీనివాసరావు ఆదివారం ప్రకటనలో పేర్కొన్నారు. సోమవారం సాయంత్రం 5:00 ప్రచార సమయం ముగుస్తుందని ఆ తర్వాత ఎవరు ప్రచారం చేయరాదని హెచ్చరించారు. ఎలక్షన్ కమిషన్ నిబంధనలు ఉల్లంఘించిన వారిపై అనర్హత వేటు వేసే అవకాశం ఉందన్నారు. వాటిని గ్రహించి అభ్యర్థులు నడుచుకోవాలన్నారు.

News February 9, 2026

పట్టణాల్లో జీ ప్లస్ 3, 5 పద్ధతిలో ఇందిరమ్మ ఇళ్లు!

image

TG: పట్టణ ప్రాంతాల్లో ఇందిరమ్మ ఇళ్లను జీ ప్లస్ 3, 5 టవర్ పద్ధతిలో రాష్ట్ర ప్రభుత్వం నిర్మించనుంది. ఒక్కో టవర్‌లో 12 ఇళ్లు ఉండేలా నిర్మాణం చేపట్టనుంది. ఇప్పటికే వీటి నిర్మాణానికి 19 స్థలాలు గుర్తించినట్లు తెలుస్తోంది. వచ్చే ఆర్థిక సంవత్సరం(ఏప్రిల్) నుంచి నిర్మాణాలు ప్రారంభించనుంది. దీనికి సంబంధించి బడ్జెట్‌లో నిధులు కేటాయించాలని ఆర్థిక శాఖకు హౌసింగ్ అధికారులు ఇప్పటికే ప్రతిపాదనలు పంపారు.