News December 1, 2025
సూర్యాపేట: ఫస్ట్ విడత నామినేషన్ వివరాలు ఇలా..!

స్థానిక సంస్థల్లో ఎన్నికల్లో భాగంగా సూర్యాపేట జిల్లాలో 8 మండలాలకు (సూర్యాపేట, తుంగతుర్తి రెవెన్యూ డివిజన్లు) సంబంధించి 159 సర్పంచ్ స్థానాలకు 1,384 నామినేషన్లు దాఖలయ్యాయి. అదే విధంగా 1,442 వార్డు స్థానాలకు 3,771 నామినేషన్లు వచ్చాయి. వీటిని అధికారులు పరిశీలించి తిరస్కరణ, ఉపసంహరణ తర్వాత బరిలో నిలిచిన అభ్యర్థుల జాబితాను ప్రకటిస్తారు.
Similar News
News February 11, 2026
గోళ్లలో ఈ లక్షణాలు కనిపిస్తే అధిక కొలెస్ట్రాల్

బాడీలో కొలెస్ట్రాల్ స్థాయులు పెరిగినప్పుడు గోళ్లలో మార్పులు కనిపిస్తాయని నిపుణులు చెబుతున్నారు. సాధారణంగా గులాబీ రంగులో ఉండే గోళ్లు రక్తప్రసరణ సరిగ్గా లేకపోవడంతో రంగుమారి పాలిపోయినట్టు/తెల్లగా కనిపిస్తాయి. ఒనికోరెక్సిస్ అని పిలిచే గాట్లు ఏర్పడతాయి. రక్త ప్రవాహం తగ్గడంతో పెరుగుదలకు కూడా ఎక్కువ సమయం పడుతుంది. ఒంకరగా పెరుగుతాయి. కొందరిలో నీలం/ఊదా రంగులో కనిపిస్తాయి.
News February 11, 2026
తెల్లకాకిని మీరెప్పుడైనా చూశారా?

ఆదోని మండలం సంతెక్కుడ్లూరు గ్రామంలో మంగళవారం అరుదైన తెల్లకాకి ప్రత్యక్షమైంది. మారెమ్మ అవ్వ దేవాలయం వద్ద కనిపించిన ఈ కాకిని చూసేందుకు గ్రామస్థులు ఆసక్తి కనబరిచారు. సాధారణంగా నల్లగా ఉండే కాకి ఇలా తెల్లగా ఉండటం వెనుక ఆల్బినిజం (Albinism) అనే జన్యుపరమైన మార్పు కారణమని నిపుణులు చెబుతున్నప్పటికీ, స్థానికులు మాత్రం దీనిని వీరబ్రహ్మేంద్రస్వామి కాలజ్ఞాన ఫలితంగా భావిస్తూ ఆశ్చర్యానికి లోనవుతున్నారు.
News February 11, 2026
మెదక్: నేడు సెలవు మంజూరు: కలెక్టర్

మున్సిపల్ ఎన్నికలలో ఓటర్లుగా ఉన్న వారందరికీ ఎలక్షన్ కమిషన్ ప్రత్యేక సాధారణ సెలవు మంజూరు చేసిందని మెదక్ కలెక్టర్ రాహుల్ రాజ్ తెలిపారు. జిల్లాలోని ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులు తమ ఓటు హక్కును వినియోగించుకోవడానికి ఈ నిర్ణయం తోడ్పడుతుందన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరూ పోలింగ్ రోజున తప్పనిసరిగా ఓటు వేయాలని ఆయన సూచించారు. ఈ ఉత్తర్వులతో ఉద్యోగులందరికీ ఓటు వేసే మార్గం సుగమమైంది.


