News March 2, 2025
సూర్యాపేట: భారీ భద్రత మధ్య ఇంటర్ ప్రశ్నా పత్రాలు

సూర్యాపేట జిల్లా తిరుమలగిరి మండల కేంద్రానికి ఈనెల 5 నుంచి జరగనున్న ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షల ప్రశ్నా పత్రాలు భారీ భద్రత మధ్య స్థానిక స్టేషన్లకు చేరుకున్నాయి. ఈ సందర్భంగా సంబంధిత అధికారులు మాట్లాడుతూ.. వార్షిక పరీక్షలకు కావల్సిన అన్ని ఏర్పాట్లు అధికార యంత్రాంగం పూర్తి చేసిందని, కట్టుదిట్టమైన భద్రత నడుమ వార్షిక పరీక్షలు జరగనున్నాయని పేర్కొన్నారు. సీఎస్, డీవోలు భిక్షం తదితరులు ఉన్నారు.
Similar News
News March 19, 2025
MBNR: GET READY.. టెన్త్ పరీక్షలకు సర్వం సిద్ధం

మహబూబ్ నగర్ జిల్లా వ్యాప్తంగా టెన్త్ పరీక్షలకు అన్ని ఏర్పాట్లు చేసినట్లు డీఈఓ ప్రవీణ్ కుమార్ తెలిపారు. పరీక్ష కేంద్రాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి ప్రత్యేకంగా నిఘా పెట్టామన్నారు. జిల్లా వ్యాప్తంగా 60 పరీక్ష కేంద్రాల్లో 12,300 మంది విద్యార్థులు పరీక్షలు రాస్తున్నారని, ఆన్‌లైన్‌లో హాల్ టికెట్లు డౌన్లోడ్ చేసుకోవాలన్నారు. ఉదయం 9:30 నుంచి మధ్యాహ్నం 12:30 వరకు పరీక్ష జరుగుతుందని అన్నారు.
News March 19, 2025
జి. కొండూరు: వరుసకు కూతురితో అసభ్య ప్రవర్తన

కూతురు వరుసయ్యే బాలికతో వ్యక్తి అసభ్యంగా ప్రవర్తించిన ఘటన జి. కొండూరు(M) చెవుటూరులో జరిగింది. విజయవాడకు చెందిన మహిళ భర్తతో విడిపోయింది. కొడుకు, కమార్తెతో వచ్చి రవీంద్రతో ఉంటోంది. సోమవారం ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఆ వ్యక్తి బాలికతో అసభ్యంగా ప్రవర్తించాడు. తల్లి పని నుంచి ఇంటికి రాగానే చిన్నారి జరిగిందంతా చెప్పింది. పోలీసులకు ఫిర్యాదు చేయగా.. పోక్సో కేసు నమోదు చేయగా.. అవమానంతో వ్యక్తి విషం తాగాడు.
News March 19, 2025
కొల్లేరు సరిహద్దులు గుర్తింపు.. వారందరిలో ఆందోళన

సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు కొల్లేరు సరిహద్దులను గుర్తించే ప్రక్రియను అధికారులు ముమ్మరంగా చేస్తున్నారు. దీంతో ఆ ప్రాంతాల్లో ఉంటున్న వారంతా ఆందోళనకు గురవుతున్నారు. ప్రజాప్రతినిధులను కలిసి తమ గోడు వెళ్లబోసుకుంటున్నారు. తమ జీవనోపాధికి ఆటంకం లేకుండా చూడాలని వేడుకుంటున్నారు. ఈ సర్వే ఇంకా పూర్తి కావాల్సి ఉంది. సర్వే పూర్తయి నివేదిక పరిశీలించిన తర్వాత సుప్రీం ఏం చేయబోతుందన్నదనే దానిపై ఉత్కంఠ నెలకొంది.