News March 26, 2024

సూర్యాపేట మీదుగా రైలు మార్గం

image

డోర్నకల్ నుంచి గద్వాల్ వరకు కొత్త రైల్వే మార్గానికి సూర్యాపేట జిల్లా మోతే మండలంలో సర్వే జరుగుతోంది. మండలంలోని కొత్తగూడెం, తుమ్మలపల్లిలో సర్వే బృందం మార్కింగ్ చేస్తున్నారు. సుమారు 296 కిలోమీటర్ల ఈ రైలు మార్గం ఉమ్మడి నల్గొండ జిల్లాలోని మోతే, చివ్వెంల, సూర్యాపేట, కేతేపల్లి, తిప్పర్తి, నల్గొండ, కనగల్, చండూరు, నాంపల్లి, చింతపల్లి మండలాల్లోని గ్రామాల నుంచి వెళ్లనుంది.

Similar News

News December 17, 2025

NLG: ‘లెక్కలు చెప్పాల్సిందే..! లేదంటే వేటు తప్పదు’

image

జిల్లాలో తొలి, మలి విడతల్లో నిర్వహించిన ఎన్నికల్లో సర్పంచ్, వార్డు మెంబర్లుగా పోటీ చేసిన అభ్యర్థులు 45 రోజుల్లోగా ఎన్నికల ఖర్చును MPDOలకు తెలియజేసి రశీదు తీసుకోవాలి. లేదంటే వేటు పడే ప్రమాదం ఉంది. ఇటీవల నిర్వహించిన గ్రామ పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థులు తమకు గుర్తులు కేటాయించిన నాటి నుంచి ఎన్నికల ఫలితాలు ప్రకటించే వరకు అయిన ఖర్చుల వివరాలు సమర్పించాలని ఎంపీడీవో జ్ఞానప్రకాశరావు తెలిపారు.

News December 17, 2025

నల్గొండ: @9AM.. పోలింగ్ శాతం ఎంతంటే?

image

నల్గొండ జిల్లా దేవరకొండ రెవెన్యూ డివిజన్ పరిధిలోని 9 మండలాలలో 9 గంటల వరకు 29.46% పోలింగ్ నమోదైనట్లు అధికారులు వెల్లడించారు. మొత్తం ఓటర్లు 2,53,689 ఉండగా 41,285 పురుషులు, 33,439 మహిళలు ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఓటింగ్ ప్రశాంతంగా కొనసాగుతున్నట్లు అధికారులు తెలిపారు. మధ్యాహ్నం ఒంటిగంట వరకు పోలింగ్ శాతం పెరిగే అవకాశం ఉందన్నారు. పోలీసులు భద్రతా ఏర్పాట్లు కొనసాగిస్తున్నారు.

News December 17, 2025

NLG: ‘యూరియా కట్టడికి ప్రభుత్వం చర్యలు’

image

యాసంగి సీజన్‌లో రైతులకు యూరియా అందించడంతో పాటు యూరియా వినియోగాన్ని కట్టడి చేసేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా నూతనంగా యూరియా బుకింగ్ యాప్‌ను తీసుకొచ్చింది. దీంతో రైతులు యాప్‌లో ఇంటి నుంచే యూరియా బుక్ చేసుకునే అవకాశం ఉంది. ఈనెల 20 నుంచి ఈ యాప్‌ను అందుబాటులో తీసుకొచ్చేలా జిల్లా వ్యవసాయ శాఖ సన్నాహాలు చేస్తుంది.