News March 16, 2025
సూర్యాపేట: రేపు ఎస్సారెస్పీ నీటి విడుదల

సూర్యాపేట జిల్లాలోని శ్రీరామ్ సాగర్ ఆయా కట్టుకు ఈనెల 17వ తేదీ నుంచి ఆరు తడి కింద 8 రోజులపాటు నీటిని విడుదల చేస్తున్నట్లు ఎస్సారెస్పీ ఎస్ఈ శివ ధర్మ తేజ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఆయకట్టు రైతులు నీటిని వృథా చేయకుండా పొదుపుగా వినియోగించుకోవాలని, చివరి భూములకు నీరు అందేలా సహకరించాలని సూచించారు.
Similar News
News February 14, 2026
BHPL: గవర్నమెంట్ జాబ్‌కు రాజీనామా.. చివరికి ఓటమి!

భూపాలపల్లి మున్సిపాలిటీ పరిధిలో 11వ వార్డు బీజేపీ కౌన్సిలర్ అభ్యర్థిగా హరీష్ పోటీ చేసి ఓటమి చెందారు. హరీష్ పంచాయతీ శాఖలో గ్రామ పంచాయతీ కార్యదర్శిగా కాంట్రాక్టు ఉద్యోగంలో పనిచేసేవాడు. మూడున్నర సంవత్సరాల పాటు ఉద్యోగంలో పనిచేస్తూ ఉద్యోగానికి రాజీనామా చేసి కౌన్సిలర్‌గా పోటీ చేశాడు. దీంతో హరీష్‌కు కేవలం 81 ఓట్లు మాత్రమే వచ్చాయి. ఉద్యోగాన్ని వదిలి సేవ చేసేందుకు వచ్చినా వార్డు ప్రజలు ఆదరించలేదు.
News February 14, 2026
జనగామ మున్సిపాలిటీలో వికసించని కమలం!

జనగామ మున్సిపాలిటీలో 30 వార్డులు ఉండగా 26 వార్డుల్లో బీజేపీ అభ్యర్థులు బరిలో నిలిచారు. కానీ, ఏ వార్డులో కూడా గట్టి పోటీ ఇచ్చిన దాఖలాలు లేవని పట్టణంలో చర్చ జరుగుతోంది. కేంద్రంలో అధికారంలో ఉన్నా.. మున్సిపాలిటీలో ఒక్క సీటు కూడా సంపాదించుకోలేదని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. 26 వార్డుల్లో రెండు వార్డులు గెలుస్తాయనే ధీమా ఉన్నా.. జిల్లా అధ్యక్షుడి కోఆర్డినేషన్ లేకపోవడం వల్ల ఓడిపోయారని చర్చ జరుగుతోంది.