News May 7, 2025
సూర్యాపేట: రోడ్డు ప్రమాదం.. యువతి స్పాట్ డెడ్

మునగాల మండలం ఆకుపాముల వద్ద శుక్రవారం రాత్రి జాతీయ రహదారిపై ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో యువతి మృతి చెందింది. స్థానికుల వివరాల ప్రకారం.. హైదరాబాదు నుంచి విజయవాడకు బైకుపై అన్నా చెల్లెలు వెళ్తున్నారు. ఈ క్రమంలో వారి బైక్ అకుపాముల వద్ద
గేదె అడ్డురావటంతో డివైడర్‌ను ఢీకొట్టారు. దీంతో బైకు వెనకాల కూర్చున్న ఆమె రోడ్డుపై పడిపోయింది. వెనుక నుంచి లారీ ఆమె పై నుంచి వెళ్లడంతో మృతి చెందింది.
Similar News
News February 17, 2026
BIG BREAKING: కాగజ్‌నగర్‌లో కాంగ్రెస్‌కు BJP మద్దతు.. ఛైర్‌పర్సన్ ఎన్నిక

ఆసిఫాబాద్ జిల్లా కాగజ్‌నగర్ మున్సిపాలిటీలో ఛైర్‌పర్సన్, వైస్ ఛైర్‌పర్సన్ ఎన్నికలు ముగిశాయి. 18వ వార్డు నుంచి కాంగ్రెస్ కౌన్సిలర్ సహిన్ సుల్తానా BJP మద్దతుతో మున్సిపల్ ఛైర్‌పర్సన్‌గా ఎన్నికయ్యారు. అలాగే వైస్ ఛైర్‌పర్సన్ ఎన్నికకు 29వ వార్డు బీజేపీ కౌన్సిలర్ కొత్తపల్లి అనితకు, 8వ వార్డు బీజేపీ కౌన్సిలర్ గజ్జల లావణ్యకు మధ్య టై ఏర్పడగా లక్కీడ్రా పద్ధతి ద్వారా అనిత వైస్ ఛైర్‌పర్సన్‌గా ఎన్నికయ్యారు.
News February 17, 2026
శరీరానికి ప్రోటీన్ చాలా ముఖ్యం

శరీరానికి కావలసినంత ప్రోటీన్ తీసుకోవడం వల్ల ఆకలి నియంత్రణలో ఉండి, అధిక క్యాలోరీలు తగ్గుతాయి. కంది, పెసర, మినప, మొదలైన పప్పులు, సొయా, రాజ్మా, అలసందలు, ఉలవలు వంటి గింజలు, పెరుగు, పన్నీర్, సోయా పన్నీర్, కొవ్వు తక్కువగా ఉండే చికెన్, సలాడ్స్, స్ప్రౌట్స్ ప్రోటీన్ ఎక్కువగా అందిస్తాయి. టీ, కాఫీ, కూల్ డ్రింక్స్, ప్యాకెట్ జ్యూసులు మానేయాలి. వీటికి బదులు నీళ్లు, మజ్జిగ, గ్రీన్ టీ, బ్లాక్ కాఫీ తీసుకోవచ్చు.
News February 17, 2026
గోమాత దర్శనంలో పఠించాల్సిన మంత్రం

1. నమో గోభ్యః శ్రీమతీభ్యః సౌరభేయాభ్య ఏవచl
నమో బ్రహ్మనుతాభ్యశ్చ పవిత్రాభ్యో నమోనమఃll
2. గావో మమాగ్రతః నను గావో మే సంతు పృష్టతఃl
గావో మే హృదయం నిత్యం గవాం మధ్యే వసామ్యాహంll
3. సర్వ దేవమయే దేవి సర్వ దేవైరలం కృతేl
మమాభిలషితంకర్మ సఫలం కురు నందినిll
గోమాతకు ఆహారం పెట్టేటప్పుడు:
ప౦చభూతశివే! పుణ్యే! పవిత్రే! సూర్య సంభవే!
ప్రతీచ్ఛేమం మయాదత్తం సౌరభేయి! నమోస్తుతే!!


