News December 2, 2025
సూర్యాపేట: సర్పంచ్ అభ్యర్థి బాండ్ పేపర్ వైరల్

తుంగతుర్తి మండలం గుడితండా గ్రామ పంచాయతీ సర్పంచ్ అభ్యర్థి గుగులోత్ జయపాల్ నాయక్ వినూత్న రీతిలో ఓట్లు అభ్యర్థిస్తున్నారు. తాను సర్పంచ్‌గా గెలిచిన తర్వాత ప్రస్తుతం ఉన్న ఆస్తులు కంటే ఎక్కువ సంపాదిస్తే తన ఆస్తులన్నింటినీ గ్రామస్థులు జప్తు చేయొచ్చని బాండ్ పేపర్ రాసి ఇచ్చారు. ఎలాంటి అవినీతికి పాల్పడకుండా పారదర్శక పాలన అందిస్తానన్నారు.తనను గెలిపించాలని కోరారు.ప్రస్తుతం ఈ బాండ్ పేపర్ SMలో వైరల్‌గా మారింది.
Similar News
News February 12, 2026
RR: రేపే లెక్కింపు.. మధ్యాహ్నానికే ఫలితాలు!

మున్సిపల్ ఎన్నికల ఫలితాలకు సర్వం సిద్ధమైంది. రేపు 64 టేబుళ్లపై ఓట్ల లెక్కింపు చేపట్టనుండగా, ఇందుకోసం 254 మంది సిబ్బందిని నియమించారు. షాద్‌నగర్‌లో అత్యధికంగా 14, ఆమనగల్‌లో అత్యల్పంగా 5 టేబుళ్లు ఏర్పాటు చేశారు. మధ్యాహ్నం 2 గంటల లోపు ఫలితాలు వెల్లడించేలా అధికారులు చర్యలు చేపట్టారు. ఈనెల 16న చైర్మన్, వైస్ చైర్మన్ల ఎంపికకు సంబంధించి ఇన్‌ఛార్జ్ అధికారులు నోటిఫికేషన్ జారీ చేయనున్నారు.
News February 12, 2026
సింగరేణి సీఎండీగా జ్యోతి బుద్ధప్రకాష్ బాధ్యతల స్వీకరణ

సింగరేణి సీఎండీగా జ్యోతి బుద్ధప్రకాష్ గురువారం బాధ్యతలు స్వీకరించారు. హైదరాబాద్‌లోని సింగరేణి భవన్‌లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన అధికారికంగా పదవీ బాధ్యతలు చేపట్టారు. సంస్థ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ (కోల్ మూమెంట్), చీఫ్ విజిలెన్స్ ఆఫీసర్ బి.వెంకన్న ఆయనకు పుష్పగుచ్ఛం అందజేసి స్వాగతం పలికారు. సీఎండీ మాట్లాడుతూ.. సంస్థ అభివృద్ధికి, కార్మికుల సంక్షేమానికి పెద్దపీట వేస్తానని స్పష్టం చేశారు.
News February 12, 2026
నల్గొండ: మున్సిపల్ పోరులో ‘సింహం’ గర్జిస్తుందా?

నల్గొండ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో AIFB అభ్యర్థులు గెలుపుపై ధీమా వ్యక్తం చేస్తున్నారు. ప్రధాన పార్టీల టికెట్లు దక్కని పలువురు నేతలు ‘సింహం’ గుర్తుపై పోటీకి దిగారు. మొత్తం 48 డివిజన్లలో ఫార్వర్డ్ బ్లాక్ తరఫున 11 మంది బరిలో నిలవగా, ఐదుగురు అభ్యర్థులు ఖచ్చితంగా గెలుస్తామని ధీమాగా ఉన్నారు. రేపు వెలువడనున్న ఫలితాల్లో సింహం గుర్తు ఏ మేరకు ప్రభావం చూపుతుందోనని నగరంలో ఆసక్తికర చర్చ సాగుతోంది.


