News March 9, 2025
సూర్యాపేట: స్వల్ప మెజారిటీతో అద్దంకి ఓటమి..!

తుంగతుర్తి నియోజకవర్గం నుంచి 2014, 2018 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీచేసి స్వల్ప మెజారిటీతో అద్దంకి దయాకర్ ఓడిపోయారు. ఈయన స్వస్థలం సూర్యాపేట జిల్లా ఆత్మకూరు(ఎస్) మండలం నెమ్మికల్ గ్రామం. దయాకర్ జేఏసీని ఏర్పాటు చేసి తెలంగాణ ఉద్యమంలో పనిచేశారు. కాగా, నిత్యం సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ ప్రతిపక్షాల విమర్శలకు ఎప్పటికప్పుడు కౌంటర్లు ఇస్తుంటారని ఈయనకు పేరు.
Similar News
News January 22, 2026
IITల్లో ఆగని ఆత్మహత్యలు.. మానసిక సమస్యలే కారణమా!

దేశవ్యాప్తంగా ఉన్న IITల్లో విద్యార్థుల ఆత్మహత్యలు కలకలం రేపుతున్నాయి. IIT కాన్పూర్‌లో మంగళవారం మరో స్టూడెంట్ సూసైడ్ చేసుకున్నారు. రెండేళ్ల వ్యవధిలో ఇదే క్యాంపస్‌లో 9మంది ఆత్మహత్యకు పాల్పడ్డారు. కుల, భాషా వివక్ష, ఒంటరితనం, పోటీ మానసిక ఆరోగ్యంపై ప్రభావం చూపడంతో సూసైడ్ చేసుకుంటున్నారని ఆరోపణలు ఉన్నాయి. ఆత్మహత్యల నివారణ, కారణాలను తెలుసుకునేందుకు సుప్రీంకోర్టు ఇప్పటికే టాస్క్‌ఫోర్స్ ఏర్పాటు చేసింది.
News January 22, 2026
ఖమ్మం జిల్లా ఆసుపత్రిలో ‘నిఘా’ వైఫల్యం

ఖమ్మం జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో భద్రత గాలిలో దీపమైంది. ఏర్పాటు చేసిన సీసీ కెమెరాల్లో మెడికల్ కౌన్సిల్ నిబంధనల కోసం పెట్టిన 12 మినహా, మిగిలినవన్నీ మరమ్మతులకు గురై మూలనపడ్డాయి. నిర్వహణ లోపంతో కీలక నేరాలు జరిగినప్పుడు ఫుటేజీ లభించక పోలీసులు ఇబ్బందులు పడుతున్నారు. కోట్లు వెచ్చిస్తున్నా పర్యవేక్షణ కరువైందని రోగులు వాపోతున్నారు. అధికారులు స్పందించి ఆసుపత్రిలో భద్రతను కట్టుదిట్టం చేయాలని కోరుతున్నారు.
News January 22, 2026
రొయ్యల్లో ఈ లక్షణాలను నిర్లక్ష్యం చేయొద్దు

రొయ్యల్లో వ్యాధులు వేగంగా వ్యాపిస్తాయి. అందుకే చెరువులోని రొయ్యల్లో కనిపించే కొన్ని లక్షణాలను రైతులు నిర్లక్ష్యం చేయకూడదంటున్నారు ఆక్వా నిపుణులు. రొయ్యలు ఆహారం తీసుకోవడం ఆకస్మికంగా తగ్గించినా, బలహీనంగా కనిపిస్తూ నీటి ఉపరితలంపై ఎక్కువ సమయం ఈదుతున్నా, రొయ్య ఎర్రగా కనిపిస్తూ, గుల్ల వదులుగా ఉన్నా, అకస్మాత్తుగా ఎక్కువ రొయ్యల మరణాలు కనిపిస్తే ఆక్వా రైతులు వెంటనే అప్రమత్తమై నిపుణుల సూచనలు తీసుకోవాలి.


