News December 2, 2025
సూర్యాపేట: 31 వరకు ’30 పోలీస్ యాక్ట్’ అమలు: ఎస్పీ

సూర్యాపేట జిల్లాలో శాంతి భద్రతల పరిరక్షణ దృష్ట్యా నేటి నుంచి డిసెంబర్ 31 వరకు ’30 పోలీస్ యాక్ట్’ అమల్లో ఉంటుందని ఎస్పీ నర్సింహ తెలిపారు. పోలీసుల అనుమతి లేకుండా ర్యాలీలు, ధర్నాలు, బహిరంగ సభలు నిర్వహించడం పూర్తిగా నిషేధమని ఆయన స్పష్టం చేశారు. నిబంధనలు ఉల్లంఘించిన వారిపై, అలాగే సోషల్ మీడియాలో అసత్యాలు వ్యాప్తి చేసిన వారిపై కఠిన చట్టపరమైన చర్యలు తప్పవని ఎస్పీ హెచ్చరించారు.
Similar News
News February 12, 2026
VZM: ఆసుపత్రి ముంగిటే మృతి

విజయనగరం మహారాజ ప్రభుత్వ సర్వజన ఆసుపత్రి ప్రాంగణంలో గుర్తుతెలియని యువకుడి మృతదేహం కలకలం రేపింది. ఆసుపత్రి క్యాజువాలిటీ వద్ద సుమారు 30 ఏళ్ల వయస్సు ఉన్న యువకుడు అచేతనంగా పడిఉన్నా సిబ్బంది ఎవరూ పట్టించుకోలేదని ఆరోపణలు వచ్చాయి. అయితే తమ వైద్య సిబ్బంది వెంటనే స్పందించి, అతడిని లోపలికి తీసుకువెళ్లి చికిత్స అందించారని అప్పటికే ఆ వ్యక్తి మరణించినట్లు సూపరింటెండెంట్ డా.పద్మజ తెలిపారు.
News February 12, 2026
VZM: ఆ 40 మందిలో మీ ఎమ్మెల్యే ఉన్నారా?

కూటమి ఎమ్మెల్యేల సమావేశంలో CM చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేశారు. సుమారు 40 మంది ఎమ్మెల్యేల పనితీరు ఆశాజనకంగా లేదని ఆయన అసహనం వ్యక్తం చేశారు. ఈ జాబితాలో ఉమ్మడి విజయనగరం జిల్లాకు చెందిన పలువురు ప్రజాప్రతినిధులు ఉన్నట్లు సమాచారం. పనితీరు మార్చుకోని వారితో నేరుగా మాట్లాడతానని CM వెల్లడించారు. మరి మీ ఎమ్మెల్యే పనితీరు ఎలా ఉంది? ఆ 40 మందిలో మీ ఎమ్మెల్యే ఉన్నారని అనుకుంటున్నారా కామెంట్ చేయండి.
News February 12, 2026
విశాఖ: ఆ 40 మందిలో మీ ఎమ్మెల్యే ఉన్నారా?

కూటమి ఎమ్మెల్యేల సమావేశంలో CM చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేశారు. సుమారు 40 మంది ఎమ్మెల్యేల పనితీరు ఆశాజనకంగా లేదని ఆయన అసహనం వ్యక్తం చేశారు. ఈ జాబితాలో ఉమ్మడి విశాఖ జిల్లాకు చెందిన పలువురు ప్రజాప్రతినిధులు ఉన్నట్లు సమాచారం. పనితీరు మార్చుకోని వారితో నేరుగా మాట్లాడతానని CM వెల్లడించారు. మరి మీ ఎమ్మెల్యే పనితీరు ఎలా ఉంది? ఆ 40 మందిలో మీ ఎమ్మెల్యే ఉన్నారని అనుకుంటున్నారా కామెంట్ చేయండి.


