News April 11, 2025

సెక్టార్ ఆఫీసర్లు భాధ్యతలు సక్రమంగా నిర్వహించాలి: సీపీ

image

ఖమ్మం: సెక్టార్ ఆఫీసర్లకు అప్పగించిన బాధ్యతలను సక్రమంగా నిర్వహించాలని, తద్వారా శాంతి భద్రతల సమస్య తలెత్తకుండా అప్రమత్తంగా ఉంటుందని ఖమ్మం సీపీ సునీల్ దత్ సెక్టార్ పోలీస్ అధికారులకు సూచించారు. శుక్రవారం అన్ని పోలీస్ స్టేషన్ల పరిధిలో ఉన్న సెక్టార్ ఇన్‌ఛార్జి పోలీస్ అధికారులతో వీసీ నిర్వహించారు. ప్రజలకు అందుబాటులో ఉంటూ ఫిర్యాదులపై తక్షణమే స్పందించి న్యాయం జరిగేలా కృషి చేయాలన్నారు.

Similar News

News January 19, 2026

కామారెడ్డి: జిల్లాలో కొనసాగుతున్న చలి తీవ్రత

image

కామారెడ్డి జిల్లా వ్యాప్తంగా చలి ప్రభావం తీవ్రమవుతోంది. సోమవారం ఉదయం నమోదైన గణాంకాల ప్రకారం జిల్లాలో సగటు కనిష్ఠ ఉష్ణోగ్రత 10.8°Cగా నమోదైంది. ముఖ్యంగా మాచారెడ్డి (లచ్చపేట)లో 12.3°C, జుక్కల్‌లో 12.3°C, గాంధారి (రామలక్ష్మణపల్లి)లో 12.8°C, ఎల్లారెడ్డి (మాచాపూర్)లో 13.7°C, దోమకొండలో 13.7°C కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.

News January 19, 2026

YCP ఎంపీ మిథున్ రెడ్డికి ఈడీ నోటీసులు

image

AP: లిక్కర్ స్కామ్ కేసులో వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డికి ఈడీ నోటీసులు జారీ చేసింది. ఈ నెల 23న విచారణకు రావాలని అందులో పేర్కొంది. కాగా ఇప్పటికే ఆ పార్టీ మాజీ ఎంపీ విజయసాయి రెడ్డికి ఈ నెల 22న విచారణకు రావాలని ఈడీ నోటీసులు ఇచ్చిన సంగతి తెలిసిందే. మద్యం అమ్మకాల ద్వారా వచ్చిన ఆదాయాన్ని నిబంధనలకు విరుద్ధంగా మళ్లించారనే ఆరోపణలపై ఈడీ విచారణ జరుపుతోంది.

News January 19, 2026

ఉమ్మడి కృష్ణా జిల్లా ప్రజలకు గుడ్ న్యూస్.. ప్రత్యేక రైళ్లు

image

సంక్రాంతి రద్దీ మేరకు సోమవారం నెం.07479/78 అనకాపల్లి- చర్లపల్లి మధ్య ఉమ్మడి కృష్ణా జిల్లా మీదుగా స్పెషల్ రైళ్లు నడుపుతున్నామని రైల్వే అధికారులు తెలిపారు. ఈ రైళ్లు ఈరోజు అర్ధరాత్రి 3.08కి కైకలూరు, 3.40కి గుడివాడ, ఉదయం 4.40కి విజయవాడ, ఉదయం 11.30కి చర్లపల్లి చేరుకుంటాయన్నారు. ప్రయాణికులు ఈ రైళ్లను వినియోగించుకోవాలని కోరారు.