News March 27, 2024
సెమిస్టర్ పరీక్షలు వాయిదా వేయాలి: SFI

విక్రమ సింహపురి యూనివర్సిటీ పరిధిలో డిగ్రీ సెమిస్టర్ పరీక్షలను వాయిదా వేయాలని ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి హర్ష కోరారు. ఈ మేరకు యూనివర్సిటీ రిజిస్టర్ డాక్టర్ రామచంద్రా రెడ్డికి వినతిపత్రం అందజేశారు. రెండు, నాలుగు సెమిస్టర్ పరీక్షలను వాయిదా వేసి 90 రోజుల తరువాతే పరీక్షలు నిర్వహించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ నాయకులు నరేంద్ర, చరణ్ తదితరులు ఉన్నారు.
Similar News
News February 19, 2026
నెల్లూరు: యువకుడి డెడ్‌బాడీ లభ్యం

బోగోలు మండలం తాడిచెట్లపాలెం సముద్రంలో ఈతకు వెళ్లి ఉలవపాల గ్రామానికి చెందిన ఇద్దరి యువకులు గల్లంతయిన విషయం తెలిసిందే. ఇద్దరు యువకులలో దీపక్ మృతదేహం ఆరోజే లభ్యం కాగా, నూనె లోకేశ్ అనే యువకుడు మృతదేహం కోసం గాలింపు చర్యలు చేపట్టారు. గురువారం లోకేశ్ డెడ్ బాడీ అల్లూరు మండలం ఇసుకపల్లె సముద్ర తీరంలో లభ్యమైంది. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కావలి ఏరియా వైద్యశాలకు తరలించారు.
News February 19, 2026
ఆత్మకూరులో నేడే మెగా జాబ్ మేళా

ఆత్మకూరు ప్రాంత నిరుద్యోగ యువతకు ఉద్యోగ కల్పన లక్ష్యంగా స్కిల్ డెవలప్మెంట్ సంస్థ ఆధ్వర్యంలో గురువారం మెగా జాబ్ మేళా నిర్వహించనున్నారు. 25 కంపెనీలు పాల్గొంటున్న ఈ మేళాలో 1400పైగా ఉద్యోగాలు లభించే అవకాశం ఉంది. ఆంధ్రా ఇంజినీరింగ్ కాలేజీ వద్ద జాబ్ మేళా జరగనుంది.
News February 19, 2026
ప్రభుత్వానికి కాకాణి సవాల్

ఇందాపూర్ డెయిరీ వ్యవహారంపై మండలిలో చర్చకు ప్రభుత్వం భయపడుతోందని మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి అన్నారు. తాడేపల్లిలో ఆయన మాట్లాడుతూ.. టీటీడీ నిధులు హెరిటేజ్‌కు మళ్లించారనే అనుమానాలపై స్పష్టత ఇవ్వాలని డిమాండ్ చేశారు. కల్తీ నెయ్యి ముసుగులో చంద్రబాబు రాజకీయ కుట్ర చేశారని విమర్శించారు. రాష్ట్ర అప్పులు, 22–ఏ భూముల అంశాలపై చర్చకు సిద్ధమని, ప్రభుత్వం దమ్ముంటే ముందుకు రావాలని సవాల్ విసిరారు.


