News November 19, 2025

సెరామిక్ పాత్రలతో ప్రయోజనం..

image

ఆరోగ్యంగా ఉండాలంటే తినే ఫుడ్డే కాదు వాడే పాత్రలూ ముఖ్యమే. అల్యూమినియం, ఇత్తడి, నాన్ స్టిక్ వల్ల అనారోగ్యం వస్తుందంటున్నారు నిపుణులు. వీటిబదులు సెరామిక్ వాడటం మంచిది. దీంట్లో రసాయనాల కోటింగులు ఉండవు. పుల్లటి పదార్థాలు వండినా రుచి, పరిమళాల్లో మార్పు రాదు. సిలికాన్‌తో రూపొందిన సెరామిక్ జెల్ నాన్‌స్టిక్‌గా పనిచేస్తుంది. ఇవి అత్యధిక ఉష్ణోగ్రతలోనూ సురక్షితంగా ఉంటాయి. శుభ్రపరచడం కూడా చాలా సులువు.

Similar News

News January 20, 2026

ప్రజల దృష్టి మళ్లించేందుకు CM ఎత్తులు: లక్ష్మణ్

image

TG: ఫోన్ ట్యాపింగ్ వెనుక ఉన్న బాధ్యులు ఎవరో తేల్చకుండా CM రేవంత్ రెండేళ్లుగా దర్యాప్తు పేరిట కాలయాపన చేశారని BJP MP లక్ష్మణ్ విమర్శించారు. ‘ప్రజల దృష్టి మళ్లించడానికి ఎత్తుకు పైఎత్తు వేస్తున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ట్యాపింగ్‌కు పాల్పడుతున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. ట్యాపింగ్‌పై కవిత చేసిన ఆరోపణలకు BRS సమాధానం చెప్పాలి’ అని ఢిల్లీలో ఆయన పేర్కొన్నారు. కలహాలతో BRS ముక్కలవుతుందని జోస్యం చెప్పారు.

News January 20, 2026

MSVPG హిట్.. చిరంజీవి ఎమోషనల్ పోస్ట్

image

MSVPG హిట్ కావడంతో ప్రేక్షకులను ఉద్దేశించి చిరంజీవి ఎమోషనల్ పోస్ట్ చేశారు. ‘మూవీపై ప్రేక్షక దేవుళ్లు చూపిస్తున్న ఆదరణతో నా మనసు కృతజ్ఞత భావనతో నిండిపోతోంది. మీరు లేనిదే నేను లేను. ఈ విజయం తెలుగు ప్రేక్షకులది. స్క్రీన్‌పై నన్ను చూడగానే మీరు వేసే విజిల్స్, చప్పట్లే నన్ను నడిపించే శక్తి. రికార్డులు వస్తుంటాయి పోతుంటాయి, కానీ మీరు నాపై చూపించే ప్రేమ శాశ్వతం. మూవీ టీంకు ధన్యవాదాలు’ అని పేర్కొన్నారు.

News January 20, 2026

పెళ్లికి ముందు రక్తపరీక్షలు ఎందుకంటే?

image

ఆరోగ్యకరమైన వైవాహిక జీవితం కోసం, పుట్టబోయే పిల్లల భవిష్యత్తు కోసం పెళ్లికి ముందే జంటలు కొన్ని రక్త పరీక్షలు చేయించుకోవాలంటున్నారు నిపుణులు. తలసేమియా, సికిల్ సెల్ అనీమియా, హెచ్‌ఐవీ, హెపటైటిస్ B, C, సిఫిలిస్ వంటి ఇన్ఫెక్షన్లు, Rh ఫ్యాక్టర్‌ను గుర్తించడానికి రక్త పరీక్షలు కీలకం. భవిష్యత్తును ఆరోగ్యకరంగా, సంతోషంగా ప్లాన్ చేసుకోవడానికి ఆరోగ్య పరీక్షలు చేయించుకోవడం ముఖ్యమని ప్రతిఒక్కరూ గుర్తించాలి.