News November 19, 2025

సేవలు – ధరలు – ఇతర వివరాలు

image

☞ సుప్రభాత సేవ: ఉ.3 గంటలకు ఉంటుంది. రోజుకు 250-300 టికెట్లు ఉంటాయి. ధర ₹120.
☞ తోమాల సేవ: సుప్రభాత సేవ తర్వాత ఉ.3.30కి ఉంటుంది. మంగళ, బుధ, గురు వారాల్లో 10 చొప్పున టికెట్లు మాత్రమే ఉంటాయి. ధర ఒక్కొక్కరికి ₹220.
☞ అర్చన సేవ: ఇది కూడా మంగళ, బుధ, గురు వారాల్లో 10 టికెట్లు మాత్రమే ఉంటాయి. టికెట్ ప్రైజ్ ₹220.
☞ అష్టదళ పాద పద్మారాధన: మంగళవారం మాత్రమే ఉండే ఈ సేవకు 60 టికెట్లు ఉంటాయి. ధర ₹1,250.

Similar News

News January 19, 2026

50 వేల మంది ఉద్యోగులను తీసుకుంటాం: డెలాయిట్

image

గ్లోబల్ సంస్థ డెలాయిట్ గుడ్‌న్యూస్ చెప్పింది. ఇండియాలో 50 వేల మంది ఉద్యోగులను నియమించుకోవాలని ప్లాన్ చేస్తున్నట్లు ప్రకటించింది. ‘ఇండియాలో 1.4 లక్షల మంది ఉద్యోగులు ఉన్నారు. ప్రపంచంలోని ప్రతి నలుగురు డెలాయిట్ ఉద్యోగుల్లో ఒకరు ఇండియన్. మరో 50 వేల మందికిపైగా తీసుకుంటాం. సంస్థ విస్తరణ కోసం మంగళూరు(KA)లో బ్రాంచ్ ఏర్పాటు చేస్తాం’ అని కంపెనీ సౌత్ ఆసియా సీఈవో రోమల్ శెట్టి ఓ కార్యక్రమంలో తెలిపారు.

News January 19, 2026

ట్రంప్‌కు ఈయూ షాక్ ఇవ్వనుందా..!

image

గ్రీన్‌లాండ్ డీల్‌ను వ్యతిరేకించిన దేశాలపై ట్రంప్ టారిఫ్స్ <<18885220>>విధించడాన్ని<<>> యూరోపియన్ యూనియన్ (EU) తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. ఈ నేపథ్యంలో ప్రతీకార సుంకాలు విధించాలని భావిస్తోంది. ఈయూ చరిత్రలో తొలిసారిగా ‘ట్రేడ్ బజూకా’ను ప్రయోగించాలని ప్లాన్ చేస్తోంది. దీనికి అదనంగా 93 బిలియన్ యూరోల(రూ.9.8 లక్షల కోట్లు) ప్రతీకార టారిఫ్స్ విధించడాన్ని ఈయూ పరిశీలిస్తోందని రాయిటర్స్ ఏజెన్సీ తెలిపింది.

News January 19, 2026

అసలేంటీ ‘ట్రేడ్ బజూకా’!

image

తమ ఆర్థిక, రాజకీయ ప్రయోజనాలను కాపాడుకునేందుకు 2023లో ‘ట్రేడ్ బజూకా’(బెదిరింపుల వ్యతిరేక సాధనం-ACI)ను EU అమల్లోకి తెచ్చింది. ఇతర దేశాల ఆర్థిక బెదిరింపులు, బలవంతపు వాణిజ్య పద్ధతుల నుంచి తమ రక్షణ కోసం రూపొందించింది. కౌంటర్ టారిఫ్స్, దిగుమతులపై ఆంక్షలు, యూరోపియన్ మార్కెట్లలోకి ఆయా దేశాల యాక్సెస్‌ను, పెట్టుబడులను నియంత్రించడం, కాంట్రాక్టుల్లో పాల్గొనకుండా బ్లాక్ చేయడం వంటి పవర్స్ దీనికి ఉంటాయి.