News August 14, 2025
సైకాలజిస్టుల కౌన్సిల్ ఏర్పాటు చేయాలని వినతి

రాష్ట్రంలో పెరుగుతున్న మానసిక ఒత్తిళ్ల నేపథ్యంలో సైకాలజిస్టులకు కౌన్సిలర్ ఏర్పాటు చేయాలని కోరుతూ తెలంగాణ సైకాలజిస్ట్ అసోసియేషన్ జనగామ జిల్లా నాయకులు కలెక్టర్ రిజ్వాన్ బాషాకు వినతిపత్రం అందజేశారు. ఆ సంఘం జిల్లా అధ్యక్షుడు రేణిగుంట్ల మురళి మాట్లాడుతూ.. ప్రస్తుత పరిస్థితుల్లో సైకాలజిస్టులకు ప్రత్యేక కౌన్సిల్ అవసరమని పేర్కొన్నారు.
Similar News
News March 11, 2026
NZB: పదో తరగతి పరీక్షలకు ఎన్ని సెంటర్లంటే..

NZB జిల్లాలో ఈనెల 14 నుంచి SSC పరీక్షలు ప్రారంభం కానున్నాయి. ఇందుకోసం అధికార యంత్రాంగం పూర్తి ఏర్పాటును చేసింది. జిల్లాలో మొత్తం విద్యార్థుల సంఖ్య:24,399
అబ్బాయిలు:12,244,
అమ్మాయిలు:12,155,
పరీక్షా కేంద్రాల సంఖ్య:144
చీఫ్ సూపరింటెండెంట్ల:144
డిపార్ట్‌మెంటల్ అధికారుల:144
ఇన్విజిలేటర్లు: 1,214 ఉన్నారు. అలాగే విద్యార్థుల సౌకర్యార్థం
జిల్లా హెల్ప్ లైన్ నంబర్: 9030282993ను ఏర్పాటు చేశారు.
News March 11, 2026
విశాఖ: 969 గ్రామ పంచాయతీల్లో ప్రత్యేక పాలన!

ఉమ్మడి విశాఖ జిల్లాలో మొత్తం 969 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. విశాఖలోని భీమిలి, పెందుర్తి మండలాల్లో 79 పంచాయతీలు ఉండగా.. అనకాపల్లి జిల్లాలోని 24 మండలాల్లో 646 పంచాయతీలు కలవు. అదేవిధంగా అల్లూరి సీతారామరాజు జిల్లాలో 11 మండలాల్లో 244 పంచాయతీలు ఉన్నాయి. ముందుగా పరిషత్ ఎన్నికలు నిర్వహించి, తర్వాత పంచాయతీ ఎన్నికలు చేపట్టే అవకాశముందని అధికార వర్గాలు చెబుతున్నాయి. దీంతో అప్పటివరకు ప్రత్యేక పాలన కొనసాగనుంది.
News March 11, 2026
ఉక్రెయిన్ ఆఫర్‌కు నో.. US చేసిన బిగ్ మిస్టేక్!

ఇరాన్ డ్రోన్లను ఎదుర్కోవడంలో US భారీ పొరపాటు చేసినట్లు సమాచారం. యుద్ధానికి 7 నెలల ముందే ఇరాన్ షాహెద్ డ్రోన్లను కూల్చే టెక్నాలజీని ఇస్తామని ఉక్రెయిన్ ఆఫర్ చేసిందని తెలుస్తోంది. పవర్‌పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా చేసిన ఈ ప్రతిపాదనను ట్రంప్ ప్రభుత్వం అప్పట్లో తిరస్కరించిందట. తీరా ఇప్పుడు ఇరాన్ డ్రోన్లు అమెరికా రక్షణ వ్యవస్థలను దెబ్బ తీస్తుండటంతో వాషింగ్టన్ ఇప్పుడు తిరిగి అదే ఉక్రెయిన్‌ను ఆశ్రయిస్తోంది.


