News January 26, 2025
సైన్స్ ఫెయిర్‌లో బాపట్ల జిల్లాకు నాలుగవ స్థానం

దక్షిణ భారత స్థాయి సైన్స్ ఫెయిర్‌లో బాపట్ల జిల్లాకు నాలుగవ స్థానం లభించిందని బాపట్ల జిల్లా విద్యాశాఖ అధికారి పురుషోత్తం చెప్పారు. పుదుచ్ఛేరిలో జరిగిన సైన్స్ ఫెయిర్‌లో బాపట్ల జిల్లా మక్కినవారిపాలెం జిల్లా పరిషత్ హైస్కూల్ విద్యార్థులు నాలుగవ స్థానంలో నిలిచారని తెలిపారు. విద్యార్థులు రూపొందించిన మల్టీపర్పస్ అగ్రికల్చర్ మిషన్‌కు సైన్స్ ఫెయిర్‌లో బహుమతి లభించిందన్నారు. విద్యార్థులను అభినందించారు.
Similar News
News February 13, 2025
రేపు తెలంగాణ బంద్

TG: ఎస్సీ వర్గీకరణకు వ్యతిరేకంగా ఫిబ్రవరి 14న తెలంగాణ బంద్‌కు మాల మహానాడు, ఎస్సీ వర్గీకరణ వ్యతిరేక పోరాట సమితి నాయకులు ఇప్పటికే పిలుపునిచ్చారు. ఇది రాజ్యాంగ వ్యతిరేకం అని, నిర్ణయాలు తీసుకునే ముందు నేషనల్ ఎస్సీ కమిషన్‌ను సంప్రదించి ఉండాల్సిందన్నారు. బంద్ పిలుపుతో శుక్రవారం ఆర్టీసీ బస్సులు, విద్యాసంస్థలు, బ్యాంకులు, ఇతర సేవలపై ప్రభావం పడే అవకాశం ఉంది.
News February 13, 2025
వంగర: ఉరి వేసుకొని వ్యక్తి మృతి

మెరకముడిదాంకు చెందిన శ్రీరాములు(52) చెడు వ్యసనాలకు బానిస అయ్యాడు. దీంతో వంగర మండలం చౌదరివలసలోని తన భార్య చెల్లెలు రమణమ్మ ఇంటికి వచ్చి ఆమెను డబ్బులు అడిగాడు. తను లేవని చెప్పడంతో అక్కడి నుంచి వెళ్లిపోయాడు. బుధవారం చౌదరివలస సమీప తోటలో చెట్టుకు ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. స్థానికులు పోలీసులకు సమాచారం అందించగా, ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేశారు.
News February 13, 2025
గ్రేటర్ HYDలో చెత్త డబ్బాలపై కమిషనర్ల నిర్ణయాలు..!

GHMCలో గత కమిషనర్ రోనాల్డ్ రాస్ ఆధ్వర్యంలో చెత్త డబ్బాలను పూర్తిగా తొలగించారు. కానీ.. రోడ్లపై చెత్త వేసే పరిస్థితి మారటం లేదని తర్వాత వచ్చిన కమిషనర్ ఆమ్రపాలి మళ్లీ చెత్త డబ్బాలను ఏర్పాటు చేశారు. అయినప్పటికీ రోడ్డుపై చెత్త దర్శనమిస్తోంది. ఈ సమస్యకు విరుగుడుగా చెత్త డబ్బా నిండగానే సిగ్నల్ వచ్చేలా ప్రస్తుత కమిషనర్ ఇలంబర్తి స్మార్ట్ డబ్బాలు ఏర్పాటు చేస్తామని ప్రకటించారు.