News December 3, 2025

సైబర్ నేరాలపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలి: ఎస్పీ

image

భూపాలపల్లి జిల్లా ప్రజలు సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలని ఎస్పీ సిరిశెట్టి సంకీర్త్ అన్నారు. మంగళవారం విద్యార్థులకు అవగాహన సమావేశంలో మాట్లాడారు. దేశవ్యాప్తంగా ప్రతిరోజూ సుమారు రూ.2 వేల కోట్లు సైబర్ మోసాల రూపంలో నష్టం జరుగుతోందన్నారు. దీనికి నివారణ ప్రజల్లో అవగాహన పెంపే ప్రధాన మార్గమని,విద్యార్థులు సైబర్ భద్రతపై తమ కుటుంబాలు, పరిసరాల్లోని ప్రజలను అప్రమత్తం చేయాలని ఎస్పీ పేర్కొన్నారు.

Similar News

News February 17, 2026

TU: L.L.B 5వ సెమిస్టర్ పరీక్షలు ఎప్పటినుంచంటే!

image

తెలంగాణ యూనివర్సిటీ పరిధిలోని LLB 5వ సెమిస్టర్ రెగ్యులర్ పరీక్షల షెడ్యూల్ ను COE ఆచార్య సంపత్ కుమార్ సోమవారం విడుదల చేశారు. ఈ నెల 23 నుంచి మార్చ్ 4 వరకు పరీక్షలు నిర్వహించనున్నట్లు ఆయన పేర్కొన్నారు. మధ్యాహ్నం 2 గం.ల నుంచి 5గం.ల వరకు జరగనున్నాయన్నారు. విద్యార్థులు మరిన్ని వివరాలకు యూనివర్సిటీ వెబ్సైట్ ను సందర్శించాలని తెలిపారు.

News February 17, 2026

రికార్డు సృష్టించిన శ్రీలంక, ఆస్ట్రేలియా మ్యాచ్‌

image

T20 WCలో భాగంగా శ్రీలంక, ఆస్ట్రేలియా మధ్య జరిగిన మ్యాచ్ రికార్డు సృష్టించింది. హాట్‌స్టార్‌లో 10 కోట్ల మంది ప్రత్యక్షంగా వీక్షించారు. దీంతో ఈ టోర్నీలో 100 మిలియన్ల వ్యూయర్‌షిప్ సాధించిన తొలి నాన్ ఇండియా మ్యాచ్‌గా నిలిచింది. ఆస్ట్రేలియా నిర్దేశించిన 181 పరుగుల <<19162360>>లక్ష్యాన్ని<<>> 2 వికెట్లు కోల్పోయి 18 ఓవర్లలోనే శ్రీలంక ఛేదించింది. T20 WCలో ఆ జట్టుకు ఇదే హయ్యెస్ట్ ఛేజింగ్.

News February 17, 2026

KMR: కలిసొచ్చిన మూడు ఓట్లు.. చైర్ పర్సన్‌కు మలుపు

image

కామారెడ్డి మున్సిపాలిటీ ఛైర్ పర్సన్ ఎన్నిక మూడు రోజులపాటు మూడు ప్రధాన పార్టీలకు ముచ్చెమటలు పట్టించి కంటిమీద కునుకు లేకుండా చేసింది. చివరకు మూడు ఓట్ల తేడాతో 38వ వార్డులో కాంగ్రెస్ అభ్యర్థి పైనే విజయం సాధించిన స్వతంత్ర అభ్యర్థి ఇప్ప ఉమారాణి (కాంగ్రెస్ రెబల్) మళ్లీ కాంగ్రెస్‌లో చేరి ఛైర్ పర్సన్‌గా ఎన్నికయ్యారు. ఎవరూ ఊహించని విధంగా అనూహ్యంగా తెరపైకి వచ్చిన ఆమె BRS మద్దతుతో పుర పీఠం ఎక్కడం గమనార్హం.