News September 10, 2025
సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలి: ఎస్పీ

వనపర్తి జిల్లాలో సైబర్ నేరాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఎస్పీ గిరిధర్ సూచించారు. జిల్లా పోలీస్ కార్యాలయంలో సైబర్ పోలీసులు, వారియర్స్‌తో సమావేశం నిర్వహించిన ఆయన ప్రజల్లో సైబర్ నేరాలపై అవగాహన పెంచేందుకు నిరంతరం కార్యక్రమాలు నిర్వహించాలని ఆదేశించారు.
Similar News
News December 11, 2025
మంచిర్యాల జిల్లాలో తొలి విజయం మహిళదే..!

హాజీపూర్ మండలం నాగారం సర్పంచ్ స్థానంపై ఉత్కంఠకు తెరపడింది. ఈరోజు జరిగిన ఎన్నికల్లో నాగారం ప్రజలు కాంగ్రెస్ వైపు మొగ్గు చూపారు. ఫలితాలు వెలువడగా 22 ఓట్లతో కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థి మహేశ్వరి గెలుపొందారు. ఈరోజు మధ్యాహ్నం 2 గంటలకు కౌంటింగ్ మొదలవగా ఎన్నికల ఫలితాలు విడుదలయ్యాయి.
News December 11, 2025
NRPT: రెండో విడత పోలింగ్ జరిగే మండలాల్లో ప్రచారం నిషేధం

NRPT జిల్లాలో రెండో విడత గ్రామ పంచాయతీ ఎన్నికలు జరిగే నారాయణపేట, దామరగిద్ద, ధన్వాడ, మరికల్ మండలాల పరిధిలో ఈ నెల 12 సాయంత్రం 5 గంటల వరకే ఎన్నికల ప్రచారం ముగించాలని, ఆ రోజు సాయంత్రం 5 గంటల తర్వాత నుంచి ప్రచార కార్యక్రమాలు నిషేధం అని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ సిక్తా పట్నాయక్ స్పష్టం చేశారు. ప్రచారం చేస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈనెల 14న రెండవ విడత ఎన్నికలు జరుగుతాయని అన్నారు.
News December 11, 2025
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో తొలి సర్పంచిగా విజయం

మణుగూరు మండలంలో సర్పంచుల స్థానాల్లో ఓ సర్పంచి ఫలితం వెలువడింది. ఈరోజు జరిగిన ఎన్నికలో బుగ్గ పంచాయతీలో ప్రజలు కాంగ్రెస్ బలపర్చిన అభ్యర్థి శెట్టిపల్లి మాధవి వైపు మొగ్గు చూపారు. అత్యధికంగా ఓట్లు పోలవ్వడంతో ఆమె సర్పంచ్ పీఠాన్ని కైవసం చేసుకున్నారు.


