News August 11, 2025

సైబర్ మోసానికి గురైతే 1930కు ఫోన్ చేయండి

image

సైబర్ మోసానికి గురైన వారు తక్షణం1930 నంబర్‌కు ఫిర్యాదు చేయాలని చిట్వేలు SI నవీన్ బాబు సూచించారు. బాధితులు మొదటి గంటలోనే ఫిర్యాదు చేయడం ద్వారా డబ్బులు వాపసు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుందన్నారు. ఫిర్యాదు చేసే సమయంలో పూర్తి వివరాలు తెలుపాలన్నారు. సైబర్ మోసాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అప్రమత్తతే రక్ష అని ఆయన స్పష్టం చేశారు.

Similar News

News March 7, 2026

తుమ్మల జోక్యంతో ఆయిల్ పామ్ రైతులకు ఊరట

image

ఆయిల్ పామ్ రైతులకు మేలు చేసే GO 594ను రద్దు చేయాలని ప్రైవేట్ కంపెనీలు దాఖలు చేసిన WP 3736/2026 కేసును హైకోర్టు కొట్టివేసింది. ప్రస్తుతం దుబాయ్‌లో ఉన్నా.. వ్యవసాయ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు చొరవ తీసుకుని అడ్వకేట్ జనరల్‌ను రంగంలోకి దించడంతో ప్రభుత్వానికి విజయం లభించింది. రైతులకు అధిక ధరలు కల్పించే ఈ జీవోను కాపాడటంపై రైతులు, టీజీ ఆయిల్ ఫెడ్ అధికారులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

News March 7, 2026

ఇరాన్‌లో మరోసారి భూకంపం

image

US, ఇజ్రాయెల్ దాడులతో అట్టుడుకుతున్న ఇరాన్‌లో మరోసారి భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై 4.1 తీవ్రత నమోదైంది. బందర్ అబ్బాస్‌కు 74 కిలోమీటర్ల దూరంలో, భూమికి 10 కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రం ఉన్నట్లు US జియోలాజికల్ సర్వే తెలిపింది. ఈనెల 3న కూడా గెరాష్ నగర సమీపంలో రిక్టర్ స్కేలుపై 4.3 తీవ్రతతో <<19288652>>భూకంపం సంభవించడం<<>> తెలిసిందే.

News March 7, 2026

శ్రీకాకుళం: కేజీబీవీల్లో ప్రవేశాలకు వేళాయె!

image

పేద విద్యార్థులకు ప్రమాణాలతో విద్య అందిస్తున్న కేజీబీవీలో 6 వ తరగతి, ఇంటర్మీడియట్ మొదటి ఏడాది ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల అయింది. శ్రీకాకుళం జిల్లాలో 25 కేజీబీవీలు ఉన్నాయి. ఈనెల 12 నుంచి ఏప్రిల్ ఒకటి వరకు దరఖాస్తుకు అవకాశం ఇచ్చారు. డ్రాప్ అవుట్, అనాధ, సింగిల్ పేరెంట్ బాలికలకు ప్రాధాన్యత ఇస్తారు. ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.