News November 19, 2025
సైలెంట్‌గా రీఛార్జ్ వ్యాలిడిటీని తగ్గించిన BSNL!

ఎయిర్టెల్, జియోలే కాకుండా ప్రభుత్వరంగ సంస్థ BSNL కూడా నిశ్శబ్దంగా రీఛార్జ్ ప్యాకేజీల్లో మార్పులు తీసుకొస్తోంది. BSNL తన రూ.107 ప్రీపెయిడ్ ప్లాన్ చెల్లుబాటును 28 రోజుల నుంచి 22 రోజులకు కుదించింది. గతంలో ఇదే రీఛార్జ్‌పై 35 రోజులు వ్యాలిడిటీ ఉండేది. ధరను పెంచకుండా ఇలా ప్లాన్ చేస్తోంది. ఇది 20% కంటే ఎక్కువ టారిఫ్ పెంపునకు సమానమని టెక్ నిపుణులు చెబుతున్నారు. దీనిపై పలువురు విమర్శలు చేస్తున్నారు.
Similar News
News January 15, 2026
ఖమ్మం జిల్లాలో సీఎం పర్యటన.. ఏర్పాట్ల పరిశీలిన

జనవరి 18న ఖమ్మం జిల్లాలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటన నేపథ్యంలో కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేయాలని జిల్లా ఇన్‌ఛార్జ్ కలెక్టర్ డాక్టర్ పి.శ్రీజ అధికారులను ఆదేశించారు. సీఎం పర్యటన ఏర్పాట్లను పోలీస్ కమిషనర్ సునీల్ దత్, అదనపు కలెక్టర్ పి.శ్రీనివాసరెడ్డి తదితరులతో కలిసి ఆమె పరిశీలించారు. ఏదులాపురం మున్సిపాలిటీ, కూసుమంచి ప్రాంతాల్లో శంకుస్థాపన, ప్రారంభోత్సవ కార్యక్రమాలు ఉంటాయని తెలిపారు.
News January 15, 2026
పురపాలికల్లో బీసీలకు 32%

TG: మున్సిపల్ ఎన్నికల్లో రిజర్వేషన్లను ప్రభుత్వం <<18860910>>ఖరారు<<>> చేసిన విషయం తెలిసిందే. ఇందులో బీసీ, ఎస్సీ, ఎస్టీలకు 50% సీట్లు కేటాయించారు. ఇక 121 మున్సిపాలిటీల్లో BCలకు 38 సీట్లు.. అంటే 32% రిజర్వేషన్లు కల్పించారు. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు 50% దాటలేదు. అయితే ఈసారి మున్సిపాలిటీల్లో బీసీ రిజర్వేషన్లు 32 శాతానికి పెరిగాయి. గత పంచాయతీ ఎన్నికల్లో BCలకు 18 శాతానికి మించలేదు.
News January 15, 2026
పాలమూరు: సీఎం రేవంత్ రెడ్డి రాక..!

ఈ నెల 17న మహబూబ్‌నగర్‌లో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేయుటకు సీఎం రేవంత్ రెడ్డి రానున్నారు. ఈ మేరకు కాంగ్రెస్ నేతలు ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి ఆదేశాల మేరకు మహబూబ్‌నగర్‌లోని ఎంవీఎస్ కళాశాల ప్రాంగణంలో నిర్వహించే బహిరంగ సభ, మల్లెబోయినిపల్లి సమీపంలో హెలీప్యాడ్ ఏర్పాట్లను పరిశీలించారు. టీపీసీసీ ప్రధాన కార్యదర్శి ఎస్.వినోద్ కుమార్, ముడా ఛైర్మన్ లక్ష్మణ్ యాదవ్, నేతలు పాల్గొన్నారు.


