News February 4, 2025

సొంత పార్టీ నేతలపై ఎమ్మెల్యే షాజహాన్ సంచలన వ్యాఖ్యలు

image

మదనపల్లె నియోజకవర్గంలో TDPని గెలవనివ్వకుండా చేస్తున్నది స్థానిక టీడీపీ నేతలేనని అ పార్టీ ఎమ్మెల్యే షాజహాన్ బాషా సంచలన వ్యాఖ్యలు చేశారు. ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. టీడీపీలో టికెట్ వాళ్లకు కాకుండా వేరేవాళ్లకు వస్తే వారిని ఓడించడమే లక్ష్యంగా పెట్టుకొని పనిచేస్తారన్నారు. గత 20 ఏళ్లుగా 4 పర్యాయాలు మదనపల్లెలో టీడీపీ ఓటమికి ఆ పార్టీ నేతలే కారణమన్నారు. టికెట్ వచ్చేంత వరకు ఒకలా, వచ్చాక వేరేలా ఉంటారన్నారు.

Similar News

News March 16, 2026

SRH కెప్టెన్‌గా అభిషేక్ శర్మ!

image

IPL: సన్‌రైజర్స్ జట్టుకు కొత్త కెప్టెన్ రానున్నట్లు తెలుస్తోంది. గాయం కారణంగా కెప్టెన్ ప్యాట్ కమిన్స్ ఆరంభ మ్యాచులకు దూరం కానున్నట్లు క్రీడావర్గాలు తెలిపాయి. దీంతో ఆయన స్థానంలో ఓపెనింగ్ సెన్సేషన్ అభిషేక్ శర్మ కెప్టెన్సీ పగ్గాలు చేపట్టనున్నట్లు అంచనా వేస్తున్నాయి. వెన్నునొప్పితో బాధపడుతున్న కమిన్స్ T20WCలో సైతం ఆడలేదు. పూర్తిగా కోలుకోవడానికి మరో 2 నుంచి 3 వారాలు పట్టే ఛాన్స్ ఉన్నట్లు సమాచారం.

News March 16, 2026

సిరిసిల్ల ప్రజావాణిలో 142 దరఖాస్తులు

image

కలెక్టరేట్‌లో సోమవారం నిర్వహించిన ‘ప్రజావాణి’ కార్యక్రమానికి బాధితుల నుంచి 142 దరఖాస్తులు వచ్చాయి. కలెక్టర్ గరిమ అగ్రవాల్ స్వయంగా అర్జీలను స్వీకరించి, వాటిని పరిశీలించారు. అత్యధికంగా రెవెన్యూ శాఖకు 56, డీఆర్డీవోకు 20, జిల్లా పంచాయతీ కార్యాలయానికి 14 దరఖాస్తులు అందాయి. గృహ నిర్మాణ శాఖకు 13, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్‌కు 7 దరఖాస్తులు రాగా.. నీటి పారుదల, మున్సిపల్, పౌర సరఫరాల శాఖలకు మిగిలినవి అందాయి.

News March 16, 2026

అధికారుల చేతుల్లోకి మున్సిపాలిటీలు.. బుధవారం నుంచి స్పెషల్ ఆఫీసర్ల రాక

image

జిల్లాలోని పిఠాపురం, తుని, పెద్దాపురం, సామర్లకోట మున్సిపాలిటీలతో పాటు గొల్లప్రోలు, ఏలేశ్వరం నగర పంచాయతీల కాలపరిమితి మంగళవారం సాయంత్రంతో ముగియనుంది. దీంతో బుధవారం నుంచి ఈ స్థానాల్లో ప్రత్యేక అధికారులు బాధ్యతలు స్వీకరించనున్నారు. తిరిగి ఎన్నికలు జరిగే వరకు లేదా గరిష్ఠంగా ఆరు నెలల పాటు అధికారుల పాలనలోనే పురపాలన కొనసాగుతుంది. పదవీకాలం పూర్తి చేసుకున్న ప్రజాప్రతినిధులంతా ఇకపై ‘మాజీలు’గా మారనున్నారు.