News March 8, 2025
సోమవారం యథావిధిగా పీజీఆర్ఎస్: పార్వతీపురం కలెక్టర్

జిల్లా, మండల స్థాయిలో జరిగే ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం సోమవారం యథావిధిగా జరుగుతుందని జిల్లా కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్ తెలిపారు. జిల్లాలో ఎంఎల్సీ ఎన్నికల కోడ్ ముగిసిన నేపథ్యంలో ఇకపై ప్రతి సోమవారం పిజిఆర్ఎస్ జరగనున్నట్లు చెప్పారు. కావున దీనిని ప్రజలు గమనించి జిల్లా ప్రధాన కేంద్రం, మండలాల్లో జరిగే ప్రజా సమస్యల పరిష్కార వేదిక నందు తమ దరఖాస్తులను అందించి సమస్యలను తెలియజేయవచ్చని తెలిపారు.
Similar News
News April 16, 2026
భద్రాద్రిలో కనులపండువగా నిత్య కళ్యాణం

భద్రాద్రి క్షేత్రంలో శ్రీ సీతారాముల నిత్య కళ్యాణ వేడుక వైభవంగా జరిగింది. వేసవి సెలవుల నేపథ్యంలో భక్తులు పెద్దసంఖ్యలో తరలివచ్చి స్వామివారిని దర్శించుకున్నారు. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని దేవస్థానం అధికారులు తాగునీరు, చలువ పందిళ్లు వంటి ముందస్తు సౌకర్యాలు కల్పించారు. ఆలయ ప్రాంగణం భక్తుల జై శ్రీరామ్ నినాదాలతో మారుమోగింది.
News April 16, 2026
క్రీడా కోర్సుల్లో ప్రవేశానికి దరఖాస్తుల ఆహ్వానం

కొత్తగూడెం: మధ్యప్రదేశ్‌లోని లక్ష్మీబాయి నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఫిజికల్ ఎడ్యుకేషన్‌లో 2026-27 విద్యా సంవత్సరానికి వివిధ కోర్సుల్లో ప్రవేశానికి దరఖాస్తులు కోరుతున్నట్లు భద్రాద్రి జిల్లా యువజన క్రీడల అధికారి పరంధామరెడ్డి తెలిపారు. BPED, MPED, యోగా, స్పోర్ట్స్ జర్నలిజం వంటి పలు కోర్సులకు అర్హులైన అభ్యర్థులు www.lnipe.edu.in వెబ్‌సైట్ ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలని ఆయన సూచించారు.
News April 16, 2026
విజయనగరంలో రేపు జాబ్ మేళా..

విజయనగరం MR కాలేజీలో ఈనెల 17న జాబ్ మేళా నిర్వహించనున్నట్లు జిల్లా ఉపాధి అధికారి వహీదా గురువారం తెలిపారు. ఉ.10.30 గంటలకు ప్రారంభమయ్యే మేళాలో టాటా ఎలక్ట్రానిక్స్, మెడ్‌ప్లస్, క్వెస్ కార్ప్, అపోలో ఫార్మసీ సంస్థలు పాల్గొంటాయని వెల్లడించారు. టెన్త్ టు డిగ్రీ/డిప్లొమా ఉత్తీర్ణులై, 18-30 ఏళ్ల మధ్య వయస్సు గల అభ్యర్థులు అర్హులు. ఎంపికైన వారికి నెలకు రూ.12,600-రూ.20,000 పైగా వేతనం లభిస్తుందని తెలిపారు.


