News November 19, 2025

సౌతాఫ్రికాతో రెండో టెస్టుకు గిల్ దూరం!

image

SAతో తొలి టెస్టులో మెడనొప్పికి గురైన IND కెప్టెన్ గిల్ రెండో టెస్టుకు దూరమయ్యారు. దీనిపై అధికారిక ప్రకటన వెలువడనుంది. తొలి టెస్టులో బ్యాటింగ్ ఆర్డర్ వైఫల్యంతో ఘోర ఓటమి మూటగట్టుకున్న భారత్‌కు గిల్ దూరమవడం పెద్ద ఎదురుదెబ్బని చెప్పవచ్చు. అతడి ప్లేస్‌లో BCCI సాయి సుదర్శన్‌ను తీసుకుంది. పంత్‌‌కు కెప్టెన్సీ బాధ్యతలు అప్పగించే అవకాశం ఉంది. ఈ నెల 22 నుంచి గువాహటిలో రెండో టెస్ట్ ప్రారంభం అవుతుంది.

Similar News

News January 13, 2026

తమిళనాడు మర్కంటైల్ బ్యాంక్‌లో ఉద్యోగాలు

image

<>తమిళనాడు <<>>మర్కంటైల్ బ్యాంక్‌ లిమిటెడ్ 20 బ్రాంచ్ హెడ్ (మేనేజర్, సీనియర్ మేనేజర్, AVP) పోస్టులకు దరఖాస్తులు కోరుతోంది. అర్హత గల అభ్యర్థులు జనవరి 31 వరకు అప్లై చేసుకోవచ్చు. పోస్టును బట్టి డిగ్రీ, పీజీ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి. వయసు 30 నుంచి 45ఏళ్ల మధ్య ఉండాలి. షార్ట్ లిస్టింగ్, ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. దరఖాస్తు ఫీజు లేదు. వెబ్‌సైట్: https://www.ib.tmbonline.bank.in

News January 13, 2026

కవిత కాంగ్రెస్‌లో చేరడం లేదు: పీసీసీ చీఫ్

image

TG: జాగృతి చీఫ్ కవిత కాంగ్రెస్‌లో చేరతారన్న ప్రచారంలో వాస్తవం లేదని పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ స్పష్టం చేశారు. మాజీ సీఎం కూతురుగా ఆమె చేస్తున్న విమర్శలపై BRS స్పందించాలన్నారు. మహిళా అధికారులపై నిరాధార ఆరోపణలు చేయడం సరికాదని, తప్పుడు ప్రచారం చేస్తున్న వారిపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. మంత్రుల శాఖల విషయంలో సీఎం జోక్యం లేదని, అందరికీ పూర్తి స్వేచ్ఛనిచ్చారని మీడియా చిట్‌చాట్‌లో తెలిపారు.

News January 13, 2026

కేంద్ర నిర్ణయాన్ని స్వాగతించిన చద్దా

image

క్విక్ కామర్స్ సంస్థల ‘10 నిమిషాల డెలివరీ’ విధానాన్ని కేంద్రం <<18845524>>తొలగించడంపై<<>> ఆప్ ఎంపీ రాఘవ్ చద్దా సంతోషం వ్యక్తం చేశారు. ‘సత్యమేవ జయతే.. అంతా కలిస్తేనే ఈ విజయం సాధ్యమైంది’ అంటూ X వేదికగా ఈ నిర్ణయాన్ని స్వాగతించారు. ఇది డెలివరీ బాయ్స్‌పై ఉండే ఒత్తిడిని తగ్గిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. గతంలో పార్లమెంటులో కూడా గిగ్ వర్కర్ల భద్రతపై ఆయన <<18483406>>గళమెత్తి<<>> వారికి మద్దతు తెలిపిన విషయం తెలిసిందే.