News August 21, 2025

స్టీల్‌ప్లాంట్‌లో క్యాంటీన్ల మూసివేతకు కారణం ఇదేనా?

image

ఓ లేఖ..స్టీల్‌ప్లాంట్‌లో ప్రైవేట్ <<17470374>>క్యాంటీన్లు మూసివేత<<>>కు కారణంగా తెలుస్తోంది. ఓ మాజీ యూనియన్ నాయకుడు ఉక్కుమంత్రిత్వశాఖకు ఆ లేఖ రాసినట్లు సమాచారం. క్యాంటీన్ నిర్వహకులు ఉచితంగా కరెంటు,నీరు వాడుకుంటూ అనాధికార క్యాంటీన్లతో ఉక్క యాజమాన్యానికి రూ.కోట్లలో నష్టం వస్తోందని ఆ లేఖలో పేర్కొన్నట్లు వార్తలొస్తున్నాయి. దీంతో ఉక్కుమంత్రిత్వశాఖ నుంచి CMDకి ఆదేశాల రావడంతో నిర్వాహకులకు నోటీసులు ఇస్తున్నట్లు సమాచారం.

Similar News

News January 20, 2026

జీవీఎంసీ అభివృద్ధి పనులు ఆదర్శనీయం: కేంద్ర బృందం

image

విశాఖలో జరుగుతున్న అభివృద్ధి పనులు ఆదర్శనీయంగా ఉన్నాయని న్యూఢిల్లీ IIPA అర్బన్ స్టడీ బృందం ప్రశంసించింది. మంగళవారం జీవీఎంసీ కమిషనర్ కేతన్ గార్గ్‌తో భేటీ అయిన 9 మంది సభ్యుల బృందం నగరంలోని స్మార్ట్ సిటీ ప్రాజెక్టులు, పారిశుద్ధ్య నిర్వహణ తీరును పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా తెలుసుకుంది. అనంతరం కాపులుప్పాడ, ముడసర్లోవ ప్లాంట్‌లను సందర్శించి నిర్వహణ తీరుపై సంతృప్తి వ్యక్తం చేసింది.

News January 20, 2026

సీతమ్మధార తహశీల్దారు కార్యాలయ అధికారులపై చర్యలు

image

సీతమ్మధార తహశీల్దార్ కార్యాలయంలో అవినీతి ఆరోపణలపై ముగ్గురు అధికారులపై క్రమశిక్షణ చర్యలకు ప్రభుత్వం ఆదేశించింది. 2021 జులైలో ఏసీబీ నిర్వహించిన తనిఖీల్లో మీ-సేవా దరఖాస్తులు కారణం లేకుండా తిరస్కరించినట్టు, లంచాలు డిమాండ్ చేసినట్లు ఆరోపణలు వెలుగుచూశాయి. అప్పట్లో విధుల్లో ఉన్న MRO జ్ఞానవేణి, డిప్యూటీ తహశీల్దార్ మొహిద్దీన్ జిలానీ, MRI రవికృష్ణలపై విచారణ చేపట్టాలని ప్రభుత్వం మెమోలు జారీచేసింది.

News January 20, 2026

బంగ్లాదేశ్ జైళ్లలో ఉన్న విజయనగరం మత్స్యకారులకు విముక్తి

image

బంగ్లాదేశ్ జైళ్లలో గత 3 నెలలుగా బందీగా ఉన్న విజయనగరం(D)కు చెందిన 9 మంది మత్స్యకారులకు త్వరలో విముక్తి లభించనుంది. విశాఖ హర్బర్ నుంచి వేటకు వెళ్లిన ఎంఎం-735 మెకనైజ్డ్ బోటు, ఇంజిన్ చెడిపోవడంతో బంగ్లాదేశ్ సరిహద్దుల్లోకి కొట్టుకుపోయింది. దీంతో ఆ దేశ కోస్ట్ గార్డ్స్, మత్స్యకారులను అరెస్టు చేసింది. ప్రజాప్రతినిధులు, రాష్ట్ర మెకనైజ్డ్ ఫిషింగ్ బోట్ ఆపరేటర్స్ అసోసియేషన్ కృషితో విడుదల సాధ్యమైంది.