News December 1, 2025
స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అంశం ప్రస్తావిస్తా: అరకు ఎంపీ

నేటి నుంచి జరగనున్న పార్లమెంటు శీతకాల సమావేశాల్లో అరకు ఎంపీ డాక్టర్ గుమ్మా తనూజా రాణి పాల్గొననున్నారు. మొంథా తుఫాను వల్ల తీవ్రంగా నష్టపోయిన రైతులకు నష్టపరిహారంపై సమావేశాల్లో చర్చించనున్నట్లు ఎంపీ తెలిపారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అంశం, గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాలల్లో విద్యార్థుల పట్ల నిర్లక్ష్యం, ప్రతిపక్ష నేతలపై అక్రమ కేసులు తదితర అంశాలపై పార్లమెంట్‌లో ప్రస్తావిస్తానన్నారు.
Similar News
News February 17, 2026
కడప: ఇవాళ సూర్యగ్రహణం.. అర్చకులు ఏమన్నారంటే?

ఇవాళ అమావాస్య సందర్భంగా సూర్యగ్రహణం భారతదేశంలో కనిపించదని, అందువల్ల ఎటువంటి గ్రహణ నియమాలు పాటించాల్సిన అవసరం లేదని కడప జిల్లా అర్చక పురోహిత సమాఖ్య అధ్యక్షుడు లక్ష్మీ సత్యనారాయణ స్వామి, ఆలయ వంశపార్య అర్చకులు విజయ్ బట్టర్ తెలిపారు. గర్భిణులను గ్రహణం పేరుతో ఇబ్బంది పెట్టవద్దని సూచించారు. యూట్యూబ్‌లో వస్తున్న గ్రహణ వదంతులను నమ్మవద్దని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.
News February 17, 2026
‘ఫర్టిగేషన్’లో ఎలాంటి ఎరువులను అందించే అవకాశం ఉంటుంది?

ఈ మధ్యకాలంలో రైతులు సేంద్రియ వ్యవసాయ పంటలకు జీవామృతం, వేస్ట్ డీకంపోజర్, వర్మీవాష్, జీవన ఎరువులను డ్రిప్ ద్వారానే అందిస్తున్నారు. జీవామృతాన్ని మాత్రం వడకట్టిన తర్వాత డ్రిప్ ద్వారా మొక్కలకు అందించాలి. రసాయన ఎరువులను డ్రిప్ ద్వారా అందిస్తే అన్ని మొక్కలకు సరైన మోతాదులో అందుతుంది. దీంతో పంట ఏకరీతిగా ఉంటుంది. ద్రవ రూపంలో నత్రజని, భాస్వరం, పొటాషియం మాత్రమే కాకుండా సూక్ష్మపోషక పదార్థాలను అందించవచ్చు.
News February 17, 2026
418 పోస్టులు.. అప్లైకి ఎల్లుండే లాస్ట్ డేట్

<


