News December 2, 2025

స్టేట్ ఎలిజిబిలిటీ టెస్టు పరీక్షలు వాయిదా

image

TG: పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో తెలంగాణ స్టేట్ ఎలిజిబిలిటీ టెస్ట్‌ను ఉస్మానియా యూనివర్సిటీ వాయిదా వేసింది. ఈ పరీక్షలకు కొత్త తేదీలను తర్వాత ప్రకటిస్తామని వర్సిటీ అధికారులు తెలిపారు. కాగా TG SET పరీక్షలు డిసెంబర్ 10, 11, 12 తేదీల్లో నిర్వహించాలని OU ఇంతకు ముందు షెడ్యూల్ విడుదల చేసింది. 3వ తేదీ నుంచి హాల్ టికెట్ల జారీకీ ఏర్పాట్లు చేసింది. అయితే స్థానిక ఎన్నికలు అదే తేదీల్లో రావడంతో వాయిదా వేసింది.

Similar News

News February 16, 2026

12 ఏళ్లకే వండర్ చేశాడు

image

Phd విద్యార్థుల కలను ఏడో తరగతి విద్యార్థి మెక్‌మిలన్(12) సాధించాడు. US డల్లాస్‌లో చిన్న ప్లేరూమ్‌లో న్యూక్లియర్ ఫ్యూజన్ రియాక్టర్‌ను నిర్మించాడు. 8 ఏళ్లకే న్యూక్లియర్ ఫిజిక్స్‌పై ఆసక్తి పెంచుకున్న చిన్నోడు ఓ సంస్థ సాయంతో ఈ ప్రాజెక్టును నిర్మించాడు. శాస్త్రీయ ఆవిష్కరణలకు వయసుతో సంబంధం లేదని చాటాడు. 2 తేలికైన పరమాణు కేంద్రకాలు కలిసి బలమైన కేంద్రకంగా మారినప్పుడు భారీగా శక్తి విడుదలవ్వడమే ఈ ప్రక్రియ.

News February 16, 2026

రూ.75వేల జీతంతో AERAలో ఉద్యోగాలు

image

ఎయిర్‌పోర్ట్స్ ఎకనామిక్ రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా(AERA)లో 3డేటా అనలిస్ట్ పోస్టులకు అప్లై చేయడానికి ఎల్లుండే ఆఖరు తేదీ. డిగ్రీ( స్టాటిస్టిక్స్) అర్హతగల వారు అప్లై చేసుకోవచ్చు. అభ్యర్థుల గరిష్ఠ వయసు 35ఏళ్లు. ఇంటర్వ్యూ/గ్రూప్ డిస్కషన్ ద్వారా ఎంపిక చేస్తారు. జీతం నెలకు రూ.75,000 చెల్లిస్తారు. వెబ్‌సైట్: https://aera.gov.in

News February 16, 2026

బహుమతిగా ఇవ్వకూడని కొన్ని వస్తువులు

image

కొన్ని వస్తువులను బహుమతిగా ఇస్తే సంబంధాలు దెబ్బతింటాయని నమ్మకం. ముఖ్యంగా నలుపు రంగు వస్తువులను గిఫ్ట్‌గా ఇవ్వకూడదంటున్నారు పండితులు. ‘ఇవి ప్రతికూల శక్తిని పెంచుతాయి. పర్సు ఇస్తే సంపద తగ్గవచ్చు. పర్ఫ్యూమ్స్, జేబు రుమాలు ఇస్తే మనస్పర్థలు, సమస్యలు తలెత్తుతాయి. ముత్యాలు కన్నీళ్లకు చిహ్నం కాబట్టి వాటిని కూడా బహుమతిగా ఇవ్వకూడదు. ఈ నియమాలు పాటిస్తే ఇంట్లో సానుకూలత పెరిగి, బంధాలు బలంగా ఉంటాయి.