News April 12, 2024

స్ట్రాంగ్ రూంలను పరిశీలించిన ఎస్పీ

image

అనంతపురం జిల్లా ఎస్పీ అమిత్ బర్దర్ జిల్లా కేంద్రంలోని పాత ఆర్డీఓ ఆఫీసులో ఈవీఎంలను భద్రపరిచిన స్ట్రాంగ్ రూంలను పరిశీలించారు. శింగనమల, అనంతపురం అర్బన్, రాప్తాడు అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించిన ఈవీఎంలు భద్రపరచనున్న స్థానిక ప్రభుత్వ ఆర్ట్స్ కళాశాల, జూనియర్ కళాశాల, సుబీన్ కళాశాలను పరిశీలించి తగిన ఏర్పాట్లు చేయాలని సూచించారు. కార్యక్రమంలో అదనపు ఎస్పీ, డీఎస్పీ పాల్గొన్నారు.

Similar News

News December 17, 2025

అనంత: సూరీడు సమయం మారిపోతోంది.!

image

అనంతపురం జిల్లా వ్యాప్తంగా చలి తీవ్రత ప్రభావంతో ప్రజలు గజ గజ వణుకుతున్నారు. దానికి తోడు ఉదయం 8.30 గంటలవుతున్నప్పటికీ పొగ మంచు కప్పి వేయడంతో సూర్య భగవానుడు సైతం కనిపించని పరిస్థితి నెలకొంటుంది. వాహనదారులు పొగ మంచు పూర్తిగా క్లియర్ అయిన తర్వాత ప్రయాణాలు చేయాలని పోలీసులు సూచిస్తున్నారు. పుట్లూరు మండలం ఎల్లుట్ల గ్రామంలో సూర్యోదయం దృశ్యాలను చూడొచ్చు.

News December 17, 2025

రాష్ట్రస్థాయి అథ్లెటిక్స్‌లో జగన్మోహన్ రెడ్డి ప్రభంజనం

image

బాపట్లలో జరిగిన రాష్ట్రస్థాయి మాస్టర్స్ అథ్లెటిక్స్ పోటీల్లో బ్రహ్మసముద్రం మండలం పిల్లలపల్లి ZP హైస్కూల్ PET జగన్మోహన్ రెడ్డి అద్భుత ప్రతిభ కనబరిచారు. లాంగ్ జంప్, ట్రిపుల్ జంప్, డిస్కస్ త్రో, 4×100 మీ. రిలే.. ఇలా పాల్గొన్న 4 విభాగాల్లోనూ బంగారు పతకాలు సాధించారు. ఈ ఘనతతో రాజస్థాన్‌లో జరగబోయే జాతీయ స్థాయి పోటీలకు ఆయన ఎంపికయ్యారు. ఆయనను ఉపాధ్యాయులు ఘనంగా అభినందించారు.