News October 6, 2025

స్ట్రాంగ్ రూమ్‌లు, కౌంటింగ్ సెంటర్లను పరిశీలించిన కలెక్టర్

image

ఖమ్మం జిల్లాలో స్థానిక సంస్థల ఎన్నికలు సజావుగా జరిగేలా పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టర్, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ పి. శ్రీజతో కలిసి కొనిజర్ల మండలం తనికెళ్ల గ్రెసీ కాలేజ్, ఖమ్మంలోని sr&bgnr కళాశాల, బారుగూడెంలోని మహ్మదీయ కళాశాలల నందు ఏర్పాటు చేసిన స్ట్రాంగ్ రూమ్, కౌంటింగ్ సెంటర్ల ఏర్పాట్లను పరిశీలించారు.

Similar News

News January 15, 2026

ఖమ్మం: మిస్సింగ్ యువకుడు సేఫ్

image

ఖమ్మంలోని ప్రకాష్ నగర్‌కు చెందిన సాఫ్ట్‌వేర్ ఉద్యోగి దిలీప్ కుమార్ అదృశ్యం సుఖాంతమైంది.‘వే2న్యూస్’లో వచ్చిన వార్తకు స్పందించిన నేషనల్ హైవే అథారిటీ అధికారులు, స్థానికులు దిలీప్ ఆచూకీని గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. త్రీ టౌన్ పోలీసులు బాధితుడిని తల్లిదండ్రులకు అప్పగించారు. కుమారుడిని సురక్షితంగా అప్పగించడంలో సహకరించిన వే2న్యూస్, అధికారులకు దిలీప్ తల్లిదండ్రులు కృతజ్ఞతలు తెలిపారు.

News January 15, 2026

ఖమ్మం: వైద్య సేవలకు ఊతం

image

ఖమ్మం జిల్లా ఆసుపత్రిలో వైద్య సేవలు మరింత విస్తృతం కానున్నాయి. కొత్తగా పది మంది ల్యాబ్‌ టెక్నీషియన్లను కేటాయించారు. నూతనంగా ఎంపికైన వీరు బుధవారం ఆసుపత్రి సూపరింటెండెంట్‌ డాక్టర్‌ జి.నరేందర్‌కు నివేదించారు. వీరి రాకతో ల్యాబ్‌ సేవలు మరింత వేగంగా అందుతాయని సూపరింటెండెంట్‌ హర్షం వ్యక్తం చేశారు. ఆసుపత్రిలో సిబ్బంది కొరత తీరడమే కాకుండా, పేద ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు సకాలంలో అందుబాటులోకి రానున్నాయి.