News May 23, 2024
స్ట్రాంగ్ రూమ్ లైవ్ ఫీడ్‌ను పరిశీలించిన కలెక్టర్, ఎస్పీ

రాయలసీమ యూనివర్సిటీలోని కంట్రోల్ రూమ్ నుంచి స్ట్రాంగ్ రూమ్ లైవ్ ఫీడ్‌ను ఎస్పీ కృష్ణకాంత్‌తో కలిసి కలెక్టర్ సృజన గురువారం పరిశీలించారు. అనంతరం ఈవీఎంలను భద్రపరచిన లైఫ్ సైన్సెస్ బ్లాక్‌ను, కౌంటింగ్ హాల్‌ను పరిశీలించి సంబంధిత రిజిస్టర్లలో సంతకం చేశారు. కలెక్టర్‌తో పాటు జాయింట్ కలెక్టర్, పాణ్యం ఎన్నికల అధికారి నారపురెడ్డి మౌర్య, కర్నూలు రిటర్నింగ్ అధికారి భార్గవ తేజ పాల్గొన్నారు.
Similar News
News March 16, 2026
పరీక్షల నిర్వహణలో నిర్లక్ష్యం వహిస్తే చర్యలు: DEO

పదో తరగతి పరీక్షల నేపథ్యంలో విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చీఫ్ సూపరింటెండెంట్లు పర్యవేక్షించాలని కర్నూలు జిల్లా విద్యాశాఖ అధికారి సుధాకర్ ఆదేశించారు. సోమవారం డీఈవో కార్యాలయం నుంచి నిర్వహించిన కమాండ్ కంట్రోల్ సెట్ కాన్ఫరెన్స్‌లో ఆయన మాట్లాడారు. విద్యార్థులకు ఏవైనా అసౌకర్యాలు కలిగితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. జిల్లా పరీక్షల విభాగపు అసిస్టెంట్ కమిషనర్ గోవింద నాయక్ పాల్గొన్నారు.
News March 15, 2026
కర్నూలు జిల్లా ప్రజలకు ఎస్పీ హెచ్చరిక

ఉగాది, రంజాన్ పండుగల సందర్భంగా డిస్కౌంట్లు, బహుమతుల పేరుతో సైబర్ నేరగాళ్లు రెచ్చిపోయే అవకాశం ఉందని జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ ప్రజలను హెచ్చరించారు. సోషల్ మీడియా, వాట్సాప్‌లలో వచ్చే అనుమానాస్పద లింకులను క్లిక్ చేయవద్దని, గుర్తుతెలియని వ్యక్తులకు బ్యాంక్ వివరాలు లేదా OTPలు చెప్పవద్దని సూచించారు. ఒకవేళ ఎవరైనా సైబర్ మోసానికి గురైతే వెంటనే 1930 హెల్ప్‌లైన్ నంబర్‌కు ఫిర్యాదు చేయాలని వారు తెలిపారు.
News March 15, 2026
ప్రతి ఒక్కరినీ అక్షరాస్యులుగా చేయడమే లక్ష్యం: కలెక్టర్

ప్రతి ఒక్కరినీ అక్షరాస్యులుగా చేయడమే ప్రభుత్వ లక్ష్యని కర్నూలు కలెక్టర్ డాక్టర్ ఏ.సిరి అన్నారు. ఆదివారం కర్నూలులోని శ్రీరామ్ నగర్‌లో ఉన్న నగర పాలక ప్రాథమిక పాఠశాలలో అక్షరాంధ్ర కార్యక్రమం ద్వారా అభ్యాసకులకు నిర్వహిస్తున్న పరీక్ష కేంద్రాన్ని ఆమె తనిఖీ చేశారు. పరీక్ష కేంద్రాల వద్ద అన్ని మౌలిక సదుపాయాలని కల్పించినట్లు కలెక్టర్ తెలిపారు.


