News February 7, 2025
స్థానిక ఎన్నికలు: సంగారెడ్డి జిల్లా పూర్తి వివరాలు

గ్రామ పంచాయతీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ అధికార యంత్రాంగం, పార్టీలు సన్నద్ధం అవుతున్నాయి. మన సంగారెడ్డి జిల్లాలో 5 అసెంబ్లీ నియోజకవర్గాలు, 12 మున్సిపాలిటీలు ఉన్నాయి. ZPTC-27, MPP-27,MPTC-276, గ్రామ పంచాయతీలు 633 ఉన్నాయి. ఎంపీటీసీ స్థానాలు 295 నుంచి 276కు తగ్గించారు. జడ్పీటీసీలు 25 నుంచి 27కు పెరిగాయి. ఈ నెల ఎన్నికల నోటిఫికేషన్ వచ్చే ఛాన్స్ ఉండడంతో గ్రామాల్లో సందడి నెలకొంది.
Similar News
News February 7, 2026
HYD: మహిళా ఇంజినీర్లకు బంపర్ ఆఫర్

HYD ఐఐఐటీలోని ఐహబ్-డేటా మహిళా గ్రాడ్యుయేట్ ఇంజినీర్ల కోసం ప్రత్యేక శిక్షణ కార్యక్రమాన్ని ప్రకటించింది. (AI), మెషీన్ లెర్నింగ్ (ML) అంశాలపై 6 నెలల పాటు ఈ శిక్షణ ఇవ్వనున్నారు. మార్చిలో ప్రారంభమయ్యే ఈ కోర్సులో ప్రతి సోమవారం క్యాంపస్‌లో తరగతులు ఉంటాయి. ప్రతిభ కనబరిచిన వారికి మూడు నెలల ఇంటర్న్‌షిప్ అవకాశం కల్పిస్తారు. ఫిబ్రవరి 20లోగా https://ihub-data.ai వెబ్‌సైట్‌లో దరఖాస్తు చేసుకోవాలన్నారు.
News February 7, 2026
HYD: ఇద్దరి పిల్లలతో తల్లి ఆత్మహత్య.. లాస్ట్ కాల్ ఆయనతో!

ఇద్దరు పిల్లలతో ఆత్మహత్యకు పాల్పడిన విజయ కేసు దర్యాప్తును పోలీసులు ముమ్మరం చేశారు. చెంగిచర్లలోని ఆమె నివాసాన్ని రైల్వే పోలీసులు తనిఖీ చేశారు. బ్యాంకు పాస్ బుక్కులు, చెక్ బుక్కులను స్వాధీనం చేసుకున్నారు. లావాదేవీలపై ఆరా తీస్తున్నారు. ఆర్థికపరమైన ఒత్తిళ్లు ఏమైనా ఉన్నాయా? అనే కోణంలో విచారణ కొనసాగిస్తున్నారు. ఫోరెన్సిక్ డాటా సేకరించారు. చివరి కాల్ సోదరుడితో సాధారణంగానే మాట్లాడినట్లు తెలిపారు.
News February 7, 2026
ఏలూరు: ‘ఆయిల్ ఫామ్ లో కొబ్బరి సాగు లాభమే’

ఏలూరు జిల్లాలో ఉద్యానవన పంటల విస్తీర్ణంపై ప్రత్యేక దృష్టి చూపాలని కలెక్టర్ వెట్రిసెల్వి అధికారులను శుక్రవారం ఆదేశించారు. ఆయిల్ పామ్, కోకో, కొబ్బరి పంటలను మరింత విస్తీర్ణంలో సాగు జరిగేలా రైతులను ప్రోత్సహించాలన్నారు. ఆయా పంటల సాగుపై రైతులకు అవగాహన కల్పించాలన్నారు. ఆయిల్ ఫామ్‌లో కొబ్బరిసాగు అధిక లాభాలు తెస్తుందని, ప్రకృతి సాగు నిరూపిస్తుందని రైతుకు క్లుప్తంగా వివరించాలని అధికారులకు సూచించారు.


