News November 16, 2025

స్థిరాస్తి లాటరీల మోసం.. అధికారులు దృష్టి సారించాలి

image

ఖమ్మం జిల్లాలో కొందరు రియల్ ఎస్టేట్ వ్యాపారులు ‘1000 కట్టు-ఫ్లాటు పట్టు’ వంటి మోసపూరిత ప్రకటనలతో లాటరీలు నిర్వహిస్తూ ప్రజల కష్టార్జితాన్ని కొల్లగొడుతున్నారని విమర్శలు వినిపిస్తున్నాయి. ఈ తరహా ఆర్థిక మోసాలను అరికట్టడానికి అధికారులు, పోలీసు యంత్రాంగం వెంటనే దృష్టి సారించి తగు చర్యలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు. అమాయక ప్రజలను ఈ మోసాల నుంచి రక్షించాలని వారు విజ్ఞప్తి చేశారు.

Similar News

News January 18, 2026

ఖమ్మం 45 ఏళ్ల నిరీక్షణకు సీఎం తెరదించేనా.. ?

image

ఖమ్మంలో ప్రభుత్వ యూనివర్సిటీ ఏర్పాటు చేయాలన్న 45 ఏళ్ల నిరీక్షణకు తెరపడాలని విద్యావంతులు కోరుతున్నారు. సీఎం రేవంత్ రెడ్డి నేటి పర్యటన నేపథ్యంలో చారిత్రక ఎస్ఆర్ అండ్ బీజీఎన్ఆర్ కళాశాలను వర్సిటీగా మార్చాలని డిమాండ్ చేస్తున్నారు. ఇప్పటికే కొత్తగూడెంలో ఎర్త్ సైన్సెస్ వర్సిటీకి అనుమతి లభించినా, ఖమ్మంలో జనరల్ వర్సిటీ అవసరమని నిరుద్యోగులు, విద్యార్థి సంఘాలు కోరుతున్నాయి.

News January 18, 2026

ఖమ్మం: ట్రాన్స్‌జెండర్ల స్వయం ఉపాధికి చేయూత

image

ఖమ్మం జిల్లాలో ట్రాన్స్‌జెండర్ల స్వయం ఉపాధి కోసం 100% సబ్సిడీతో రూ. 75 వేల ఆర్థిక సాయం అందించనున్నట్లు జిల్లా సంక్షేమ అధికారి విజేత తెలిపారు. 18-55 ఏళ్ల వయస్సు ఉండి, కలెక్టర్ జారీ చేసిన ఐడీ కార్డు ఉన్నవారు అర్హులు. గ్రామీణ ప్రాంతాల్లో రూ. 1.50 లక్షలు, పట్టణాల్లో రూ. 2 లక్షలలోపు వార్షిక ఆదాయం ఉండాలి. ఆసక్తి గలవారు ఈ నెల 25లోపు జిల్లా సంక్షేమ కార్యాలయంలో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.

News January 18, 2026

ఖమ్మం: పీడీఎస్‌యూ రాష్ట్ర మహాసభలను విజయవంతం చేయాలి

image

ఈనెల 23, 24, 25న ఖమ్మంలో జరిగే PDSU రాష్ట్ర 23వ మహాసభల విజయవంతానికై రాష్ట్ర నలుమూలల నుంచి విద్యార్థులు భారీగా తరలిరావాలని రాష్ట్ర అధ్యక్షుడు కాంపాటి పృథ్వీ విజ్ఞప్తి చేశారు. శనివారం ఖమ్మం రామ నర్సయ్య విజ్ఞాన కేంద్రంలో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. కేంద్ర, రాష్ర్ట ప్రభుత్వాలు విద్యారంగాన్ని ప్రైవేట్‌, కార్పొరేట్‌ యాజమాన్యాలకు అప్పగించి విద్యావ్యవస్థను పూర్తిగా వ్యాపారమయం చేశారని విమర్శించారు.