News November 20, 2025
స్పోర్ట్స్ రౌండప్

* ప్రపంచ బాక్సింగ్ కప్ ఫైనల్లో నిఖత్ జరీన్.. ఇవాళ చైనీస్ తైపీకి చెందిన గువాయి గ్జువాన్‌తో అమీతుమీ
* బధిర ఒలింపిక్స్(డెఫ్లింపిక్స్)లో ఇప్పటివరకు 11 పతకాలు సాధించిన భారత షూటర్లు
* టెన్నిస్ ‘హాల్ ఆఫ్ ఫేమ్-2026’కు ఎంపికైన దిగ్గజ ప్లేయర్ ఫెదరర్
* ఆస్ట్రేలియన్ ఓపెన్ సూపర్ 500 బ్యాడ్మింటన్ పురుషుల సింగిల్స్‌లో రెండో రౌండ్‌లో లక్ష్య సేన్, ప్రణయ్
* ఝార్ఖండ్‌తో రంజీ మ్యాచులో ఆంధ్ర విజయం
Similar News
News January 17, 2026
రేగిపండ్లతో లాభాలెన్నో..

*విటమిన్ ‘సి’ వల్ల రోగనిరోధక శక్తితో పాటు చర్మం ఆరోగ్యంగా ఉంటుంది
*అధిక ఫైబర్ వల్ల జీర్ణశక్తి పెరుగుతుంది
*గ్లైసెమిక్ ఇండెక్స్ తక్కువగా ఉండటం వల్ల డయాబెటిస్ ఉన్న వారు కూడా తినొచ్చు (మితంగా)
*యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. దీనివల్ల గుండె, మెదడు ఆరోగ్యంగా ఉంటాయి
*క్యాలరీలు తక్కువగా ఉంటాయి.
News January 17, 2026
₹16 లక్షల కోట్లకు చేరనున్న రిటైల్ వస్త్ర వ్యాపారం

దేశంలో రిటైల్ వస్త్ర వ్యాపారం శరవేగంగా విస్తరిస్తోంది. 2029-30 నాటికి ₹16 లక్షల కోట్లకు విస్తరించనుందని ‘కేర్ ఎడ్జ్’ అంచనా వేసింది. ‘ప్రస్తుతం 9.30 లక్షల కోట్లతో 41% శాతం వాటా రిటైల్ వ్యాపారానిదే. బ్రాండెడ్ దుస్తులకు ప్రాధాన్యం పెరగడం, అంతర్జాతీయ బ్రాండ్ల ప్రవేశంతో మరో 13% పెరగనుంది. టైర్2, 3 పట్టణాల్లో ఈ కామర్స్ సహా, జుడియో, మాక్స్ ఫ్యాషన్, రిలయన్స్ యోస్టా వంటివి వ్యాపారాన్ని విస్తరిస్తున్నాయి.
News January 17, 2026
పెళ్లి చేసుకుంటే రూ.2లక్షలు.. నేటి నుంచే అమల్లోకి

TG: దివ్యాంగుల వివాహానికి రూ.2 లక్షల ఆర్థిక సాయం అందిస్తామని CM రేవంత్ రెడ్డి ఇటీవల ప్రకటించిన <<18836703>>విషయం<<>> తెలిసిందే. ఇది నేటి నుంచి అమల్లోకి వచ్చినట్లు ప్రభుత్వం జీవో జారీ చేసింది. ఆర్థిక సాయం భార్య పేరున జమ చేయనున్నట్లు స్పష్టం చేసింది. ఈ నిర్ణయంతో దివ్యాంగ దంపతులకు వివాహానంతరం ఎదురయ్యే ఆర్థిక ఒత్తిళ్లు తగ్గడంతోపాటు, నివాసం, వైద్య ఖర్చులు, జీవనోపాధికి సహాయ పడుతుందని పేర్కొంది.


