News August 13, 2025
స్వచ్ఛందంగా నమోదయ్యేలా చూడండి: కలెక్టర్

పీ4 కార్యక్రమంలో భాగంగా నీడ్ అనాలసిస్ సర్వేను యుద్ధప్రాతిపదికన పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ వెట్రిసెల్వి అధికారులను ఆదేశించారు. ఏలూరులో టెలికాన్ఫరెన్స్‌లో కలెక్టర్ మాట్లాడారు. మార్గదర్శలపై ఎలాంటి ఒత్తిడి లేకుండా స్వచ్ఛందంగా బంగారు కుటుంబాల అనుసంధాన ప్రక్రియను పూర్తి చేయాలని కోరారు. జిల్లా అధికారులు, ఎంపీడీఓలు, మున్సిపల్ కమిషనర్లు ఈ సమావేశంలో పాల్గొన్నారు.
Similar News
News March 13, 2026
ASF: స్కాలర్‌షిప్స్ అకౌంట్‌లో జమ

ASF జిల్లాలోని ఎస్సీ విద్యార్థుల 2024-25 వార్షిక పోస్ట్-మెట్రిక్ ఉపకార వేతనాలు నేరుగా వారి బ్యాంక్ ఖాతాల్లో జమ చేసినట్లు జిల్లా షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి అధికారి అశోక్ మదిరె తెలిపారు. కేంద్రం రూ.10.86 లక్షలు, రాష్ట్రం రూ.10.49 లక్షల నిధులు విడుదల చేసింది. మొత్తం 212 మంది విద్యార్థుల ఖాతాల్లో జమ చేసి, కొంత నిర్వహణ కోసం మినహాయించి మిగతా మొత్తాన్ని ట్యూషన్ ఫీజులుగా కళాశాలలకు చెల్లించారని తెలిపారు.
News March 13, 2026
అల్లూరి జిల్లాలో ఓపెన్ ఇంటర్ పరీక్షలకు 39 మంది దూరం

ఉమ్మడి అల్లూరి జిల్లాలో శుక్రవారం జరిగిన ఓపెన్ ఇంటర్ పరీక్షలకు 39మంది విద్యార్థులు దూరంగా ఉన్నారని పరీక్షల అసిస్టెంట్ కమిషనర్ శశికుమార్ తెలిపారు. 6 కేంద్రాల్లో బయాలజీ, కామర్స్ పరీక్షలు జరిగాయి. అల్లూరి జిల్లాలో 172మందికి గాను 161మంది రాశారని, పోలవరం జిల్లాలో 223కి గాను 195మంది రాశారని తెలిపారు. ఏజెన్సీ DEO.మల్లేశ్వరావు అడ్డతీగల సెంటర్స్‌ను పరిశీలించి, సిబ్బందికి సూచనలు ఇచ్చారు.
News March 13, 2026
తిరుపతిలో చిన్నారి మృతికి కారణం ఇదే..!

తిరుపతి ప్రసూతి ఆసుపత్రిలో రెండు రోజుల <<19369150>>పసికందు చనిపోయిన <<>>విషయం తెలిసిందే. దీనిపై ఆసుపత్రి సూపరిటెండెంట్ ప్రమీలాదేవి స్పందించారు. ‘పాలు తాగిన వెంటనే పడుకోబెట్టారు. దీంతో చిన్నారి ఊపిరితిత్తుల్లోకి పాలు వెళ్లాయి. రుయా చిన్నపిల్లల ఆసుపత్రికి తరలించి చికిత్స అందించినా ఫలితం లేకుండా పోయింది. మిల్క్ ఆస్పిరేషన్ కారణంగా మరణించినట్లు వైద్యులు నిర్ధారించారు’ అని ఆమె తెలిపారు


