News February 18, 2025
స్వచ్ఛ సుందర పార్వతీపురం సాధిద్దాం: కలెక్టర్

జిల్లాలోని మునిసిపాలిటీల్లో అందుబాటులో ఉండే వనరులతో స్వచ్ఛతకు పెద్దపీట వేసి స్వచ్ఛ సుందర పార్వతీపురంగా తీర్చిదిద్దాలని జిల్లా కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్ అధికార యంత్రాంగానికి దిశా నిర్దేశం చేశారు. కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో స్వచ్ఛ సుందర పార్వతీపురంపై సంబంధిత అధికారులతో కలెక్టర్ సోమవారం సమీక్షించారు. స్వచ్ఛ సుందర పార్వతీపురం అందరి బాధ్యతని అన్నారు.
Similar News
News April 16, 2026
మెదక్: రైతు బంధు నిలిపివేయడంపై హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు

రైతులకు రావాల్సిన రైతు బంధు నిలిపివేయడంపై తెలంగాణ హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. మెదక్ జిల్లా నార్సింగి మండలం శంకాపురం గ్రామానికి చెందిన పిటిషనర్ల భూములకు సంబంధించి రైతు బంధు మొత్తాలు నిలిపివేయడం, పండించిన ధాన్యాన్ని కొనుగోలు చేయకపోవడం చట్టవిరుద్ధమని ప్రాథమికంగా గుర్తించిన న్యాయస్థానం, కలెక్టర్ సహా సంబంధిత అధికారులపై వెంటనే చర్యలు తీసుకోవాలని ఆదేశించింది.
News April 16, 2026
మామునూర్ ఎయిర్‌పోర్ట్ అభివృద్ధిపై ఏఏఐ సమీక్ష

వరంగల్‌లో మామునూర్ ఎయిర్‌పోర్ట్‌ను గురువారం ఎయిర్‌పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా అధికారులు సందర్శించారు. కలెక్టర్ సత్య శారదతో కలిసి సమావేశమై రన్‌వే, టెర్మినల్ సదుపాయాలు, భద్రత అంశాలను సమీక్షించారు. అభివృద్ధి పనులపై అవసరమైన మెరుగుదలలపై చర్చించారు. ఎయిర్‌పోర్ట్ అభివృద్ధితో రవాణా, పరిశ్రమలు, పర్యాటక రంగాలకు ఊతమిస్తుందని అధికారులు తెలిపారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ సంధ్యారాణి తదితరులు పాల్గొన్నారు.
News April 16, 2026
ముంబై బ్యాటింగ్.. రోహిత్ శర్మ దూరం

ముంబైతో మ్యాచులో పంజాబ్ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది. రోహిత్ శర్మ ఈ మ్యాచుకు దూరం అయ్యారు. డికాక్ జట్టులోకి వచ్చారు.
ముంబై: డికాక్, రికెల్టన్, సూర్య, తిలక్, నమన్ ధీర్, హార్దిక్ (C), రూథర్‌ఫోర్డ్, శార్దుల్ ఠాకూర్, దీపక్ చాహర్, మయాంక్ రావత్, బుమ్రా.
పంజాబ్: ప్రభ్‌సిమ్రాన్, ప్రియాన్ష్, శ్రేయస్(C), కనోలి, శశాంక్ సింగ్, స్టాయినిస్, యాన్సెన్, బార్ట్‌లెట్, వైశాక్, అర్ష్‌దీప్, చాహల్.


