News August 14, 2025
స్వతంత్రానికి చిహ్నం మన ‘స్వరాజ్ థియేటర్’

తెనాలికి స్వతంత్ర సంగ్రామంలో ప్రత్యేక చరిత్ర ఉంది. స్వతంత్రం ప్రకటించిన రోజే తెనాలిలో ఓ థియేటర్ ఓపెన్ చేశారని మీకు తెలుసా? అదే స్వరాజ్ టాకీస్. 1947 ఆగస్టు 15న ప్రారంభించారు. స్వాతంత్ర్యానికి చిహ్నంగా ఈ పేరు పెట్టారు. లండన్, జపాన్ నుంచి పరికరాలను దిగుమతి చేసుకుని ఆరోజుల్లోనే రూ.1.24 లక్షల వ్యయంతో దీనిని నిర్మించారు. ప్రస్తుతం ఇది మూతబడింది.
Similar News
News March 13, 2026
GNT: గ్యాస్ వినియోగదారులకు హెల్ప్ లైన్ నెంబర్

గుంటూరు జిల్లాలో LPG కొరత లేదని, వినియోగదారులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని అధికారులు తెలిపారు. గ్యాస్ నిల్వలు తగ్గుతాయనే ప్రచారాలను నమ్మవద్దని సూచించారు. జిల్లాలో గ్యాస్ సరఫరాపై పర్యవేక్షణ కోసం ప్రత్యేక కంట్రోల్ రూమ్ 8309160972, 6309520569 ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. అవసరాలకు తగిన విధంగా సిలిండర్ల సరఫరా కొనసాగుతుందని తెలిపారు.
News March 13, 2026
ఈ నెల 16 నుంచి ఒంటిపూట బడులు: గుంటూరు DEO

వేసవి తీవ్రత దృష్ట్యా ఈ నెల 16 నుంచి గుంటూరు జిల్లాలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల యాజమాన్యాలు ఒంటి పూట నిర్వహించాలని DEOసలీం భాష సూచించారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు ఉదయం 8 నుంచి 12.30ని.ల వరకు తరగతులు నిర్వహించాలన్నారు. 10వ తరగతి పరీక్షా కేంద్రాలున్న పాఠశాలలను మధ్యాహ్నం ఒంటిగంట నుండి సాయంత్రం 5 గంటల వరకు నిర్వహించాలని అన్నారు.
News March 13, 2026
అమరావతి అగ్నిప్రమాదంపై విచారణకు సీఎం ఆదేశం

అమరావతి ప్రాంతంలోని మందడం దగ్గర జరిగిన భారీ మంటల ఘటనపై CM చంద్రబాబు నాయుడు విచారణకు ఆదేశాలు జారీ చేశారు. కలెక్టర్ల సమావేశంలోని టీ సమయంలో ఉన్నతాధికారులతో ఈ అంశాన్ని చర్చించారు. ఇది యాదృచ్ఛికంగా జరిగిందా లేక ఇతర కారణాలున్నాయా అనే కోణంలో పరిశీలించాలని సూచించారు. నిర్మాణ పనులకు ఉపయోగించే సామగ్రి నిల్వ ఉన్న ప్రదేశంలో పెద్ద ఎత్తున మంటలు చెలరేగడంతో జరిగిన నష్టం, పరిస్థితులపై పూర్తి వివరాలు ఇవ్వాలన్నారు.


