News August 23, 2025
స్వమిత్వ సర్వేపై కలెక్టర్ సమీక్ష

జిల్లాలో స్వమిత్వ సర్వేపై బాపట్ల కలెక్టర్ వెంకట మురళి శుక్రవారం అధికారులతో సమీక్షించారు. ఆయన మాట్లాడుతూ.. గ్రామాల్లో డ్రోన్ సర్వే పనులను వేగవంతం చేయాలన్నారు. పూర్తయిన గ్రామాల్లో హక్కు పత్రాలను త్వరితగతిన పంపిణీ చేయాలని ఆదేశించారు. సర్వేలో తలెత్తే వివాదాలు, అభ్యంతరాలను పారదర్శకంగా పరిష్కరించాలని అధికారులకు సూచించారు. సర్వే ద్వారా ప్రజలకు తమ ఆస్తులపై స్పష్టమైన హక్కులు లభిస్తాయన్నారు.
Similar News
News January 12, 2026
SKLM: విద్యుత్ సమస్యలపై ఈ నెల 20 నుంచి ప్రజాభిప్రాయ సేకరణ

రాష్ట్రంలో ఈ ఆర్థిక సంవత్సరానికి సంబంధించి విద్యుత్ టారిఫ్ ప్రతిపాదనలపై AP విద్యుత్ నియంత్రణ మండలి ఆధ్వర్యంలో ఈనెల 20 నుంచి27వరకు ప్రజాభిప్రాయసేకరణ నిర్వహించనున్నట్లు శ్రీకాకుళం SE నాగిరెడ్డి కృష్ణమూర్తి సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ విచారణలు హైబ్రిడ్ విధానంలో యూట్యూబ్, ఫేస్ బుక్ వంటి సామాజిక మాధ్యమాల్లో ప్రత్యక్ష ప్రసారం జరుగుతుందన్నారు. టెక్కలి పలాస డివిజన్ కార్యాలయాల నుంచి పాల్గొనవచ్చన్నారు.
News January 12, 2026
నాణ్యతలో రాజీ పడొద్దు.. విద్యార్థుల కిట్‌పై రేవంత్

TG: ప్రభుత్వ స్కూళ్ల విద్యార్థులకు అందించనున్న 22 వస్తువుల కిట్‌కు సంబంధించి నాణ్యత విషయంలో రాజీపడొద్దని CM రేవంత్ రెడ్డి అధికారులకు సూచించారు. ‘వేసవి సెలవుల తర్వాత బడులు ప్రారంభమయ్యే నాటికి కిట్ అందించేలా చర్యలు తీసుకోవాలి. విద్యార్థుల విషయంలో ఖర్చుకు వెనకాడొద్దు. యూనిఫామ్, బెల్ట్, టై, షూస్, బ్యాగ్, నోట్ బుక్స్, ఇతర వస్తువులను అందించేందుకు ప్రొక్యూర్మెంట్ ప్లాన్లు సిద్ధం చేయాలి’ అని ఆదేశించారు.
News January 12, 2026
రబీ సీజన్‌కు సరిపడా యూరియా ఉంది: వ్యవసాయాధికారి

రబీ 2025–26 సీజన్‌కు సరిపడా యూరియా అందుబాటులో ఉందని జిల్లా వ్యవసాయ అధికారి విజయ్ కుమారి తెలిపారు. జిల్లాకు అవసరమైన 38,353 మెట్రిక్ టన్నుల యూరియాకు ప్రణాళిక రూపొందించగా, ఇప్పటివరకు 25,504 మెట్రిక్ టన్నులు రైతులకు సరఫరా చేసామని. అక్టోబర్ 1, 2025 నుంచి జనవరి 11, 2026 వరకు 21,734 మెట్రిక్ టన్నుల విక్రయాలు జరిగినట్లు తెలిపారు. యూరియా కృత్రిమ కొరత సృష్టిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.


