News August 12, 2025

స్వాతంత్ర్య దినోత్సవాన్ని నిర్వహించడానికి అధికారులు చర్యలు: జేసీ

image

స్వాతంత్ర్య దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించడానికి అధికారులు చర్యలు తీసుకోవాలని ఇన్‌ఛార్జ్ జేసీ జి. గంగాధర్ గౌడ్ తెలిపారు. ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలు తీరు, అభివృద్ధి కార్యక్రమాలపై ప్రజలకు అవగాహన కల్పించేలా స్టాల్స్ ఏర్పాటు చేయాలన్నారు. జిల్లా ప్రగతిని చాటి చెప్పేలా శకటాల ప్రదర్శన ఉండాలన్నారు. స్వాతంత్ర్య దినోత్సవ కార్యక్రమాలు నిర్వహించే పోలీస్ కవాతు మైదానాన్ని తీర్చిదిద్దాలన్నారు.

Similar News

News March 17, 2026

ఏప్రిల్ 15 వరకు పశువులకు గాలికుంటు టీకాలు: జేసీ

image

2030 నాటికి గాలికుంటు వ్యాధిని పూర్తిగా నియంత్రించడమే లక్ష్యమని జేసీ నిశాంతి తెలిపారు. మంగళవారం అమలాపురం కలెక్టరేట్‌లో టీకా కార్యక్రమ పోస్టర్‌ను ఆవిష్కరించారు. పశుసంవర్ధక శాఖ ఆధ్వర్యంలో మార్చి 16 నుంచి ఏప్రిల్ 15 వరకు ఈ కార్యక్రమం నిర్వహించనున్నట్లు వెల్లడించారు. ఏడాదికి రెండుసార్లు క్రమం తప్పకుండా టీకాలు వేయించాలని పాడి రైతులకు సూచించారు. జాతీయ పశువ్యాధి నియంత్రణ పథకం కింద ఈ టీకాలు వేయనున్నారు.

News March 17, 2026

వికారాబాద్‌లో వరుస సెలవులు!

image

వికారాబాద్‌లో ఒక్కపూట బడులు ప్రారంభం కావడంతో పాటు మార్చి నెలలో పండుగల సెలవులు కలిసొస్తున్నాయి. మార్చి 19న ఉగాది పండుగ సందర్భంగా వరుసగా సెలవులు రానున్నాయి. ఏప్రిల్ 23 వరకు ఒంటిపూట బడులు కొనసాగి, ఆ తర్వాత వేసవి సెలవులు ప్రారంభం కానున్నాయి. మార్చిలోనే ఉగాది, రంజాన్ పండుగలు రావడంతో విద్యార్థులకు వరుస విరామం దొరకనుంది. దీంతో అటు పండుగలు, ఇటు పరీక్షల సన్నద్ధతలో విద్యార్థులు నిమగ్నమయ్యారు.

News March 17, 2026

రాజమండ్రి: మార్చి 19న ఉగాది పురస్కారాలు

image

రాజమండ్రి పార్లమెంట్ పరిధిలోని కవులు, పండితులు, కళాకారులను గౌరవించేందుకు మార్చి 19న ‘శ్రీ పరాభవ నామ సంవత్సర ఉగాది పురస్కార మహోత్సవం’ నిర్వహించనున్నట్లు MP పురందీశ్వరి మంగళవారం తెలిపారు. నగరంలోని జె.కె. గార్డెన్స్ వద్ద ఈ వేడుకకు ఏర్పాట్లు చేసినట్లు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో వివిధ రంగాల్లోని ప్రతిభావంతులను సముచిత రీతిలో సన్మానిస్తామని వెల్లడించారు.