News November 17, 2025
స్విమ్మింగ్ పోటీల్లో బాపట్ల విద్యార్థికి గోల్డ్ మెడల్

ఏపీ స్టేట్ ఇంటర్ డిస్ట్రిక్ట్ స్విమ్మింగ్ పోటీల్లో బాపట్ల మండలం దగ్గుమళ్లి వారిపాలెం విద్యార్థి శ్రీయాన్ ఆనంద్ సత్తా చాటి గోల్డ్ మెడల్ సాధించినట్లు జిల్లా స్విమ్మింగ్ అసోసియేషన్ సెక్రటరీ మురళి చెప్పారు. ఆదివారం విజయవాడలో నిర్వహించిన పోటీల్లో సబ్ జూనియర్స్ ఛాంపియన్షిప్-2025లో తొలి స్థానంలో నిలిచి గోల్డ్ మెడల్ సాధించాడన్నారు. విజేతగా నిలిచిన విద్యార్థినిని పలువురు అభినందించారు.
Similar News
News January 14, 2026
సిద్దిపేట: ‘కుల వివక్షతో యువ డాక్టర్ ఆత్మహత్య’

సిద్దిపేట మెడికల్ కాలేజీలో 4వ సంవత్సరం చదువుతున్న డాక్టర్ లావణ్య ఆత్మహత్య ఘటన సంచలనం సృష్టించింది. సీనియర్ డాక్టర్ ప్రణయ్ ప్రేమ పేరుతో మోసం చేసి, పెళ్లి ప్రస్తావన రాగానే కులం పేరుతో నిరాకరించడంతో ఆమె మనస్థాపానికి గురై ఆత్మహత్య చేసుకున్నారు. ఈ ఘటనపై ఎమ్మార్పీఎస్, డీబీఎఫ్ నాయకులు అదనపు కలెక్టర్‌ను కలిసి, నిందితుడిపై కఠిన చర్యలు తీసుకుని బాధితురాలి కుటుంబానికి న్యాయం చేయాలని వినతిపత్రం అందజేశారు.
News January 14, 2026
మరో 9 అమృత్ భారత్ రైళ్లు.. ఏపీ మీదుగా వెళ్లేవి ఎన్నంటే?

కేంద్ర ప్రభుత్వం కొత్తగా 9 అమృత్ భారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్లకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. వీటిలో నాలుగు రైళ్లు పశ్చిమ బెంగాల్ నుంచి ఏపీ మీదుగా తమిళనాడు, బెంగళూరు వరకు పరుగులు తీయనున్నాయి. ఖరగ్‌పూర్, భువనేశ్వర్, విశాఖపట్నం, విజయవాడ వంటి ప్రధాన స్టేషన్లకు ఈ రైళ్లు కనెక్టివిటీని పెంచనున్నాయి. ఈ ట్రైన్లలో న్యూ జల్‌పాయ్‌గురి నుంచి తిరుచిరాపల్లి వెళ్లే రైలు దేశంలోనే అతి పొడవైన రూట్లలో ఒకటిగా నిలవనుంది.
News January 14, 2026
సిరిసిల్ల: ప్రమాదాల నివారణకు సహకరించాలి: ఎస్పీ

ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించి రోడ్డు ప్రమాదాలను నివారణకు సహకరించాలని సిరిసిల్ల ఎస్పీ మహేశ్ బీ గీతె అన్నారు. సిరిసిల్లలోని ప్రభుత్వ కళాశాలలో ఉపాధ్యాయులు, విద్యార్థులకు మంగళవారం రహదారి భద్రతపై అవగాహన కల్పించారు. ఎస్పీ మాట్లాడుతూ.. నిబంధనలు పాటిస్తూ జాగ్రత్తగా వాహనాలు నడపడం ద్వారా మీ ప్రాణాలే కాకుండా ఎదుటివారి ప్రాణాలు కూడా కాపాడిన వారు అవుతారని ఆయన పేర్కొన్నారు.


