News March 14, 2025

హనుమకొండ: ఈ నెల 15 నుంచి ఏఐ విద్య బోధన: యోగితా రాణా

image

ఈ నెల 15వ తేదీ నుంచి జిల్లాలలో ఎంపిక చేసిన ప్రాథమిక ప్రభుత్వ పాఠశాలల్లో కృత్రిమ మేధ ఏఐను వినియోగిస్తూ సులభతరంగా విద్యాబోధన చేసేందుకు చర్యలు చేపట్టాలని విద్యాశాఖ కార్యదర్శి యోగితా రాణా అన్నారు. గురువారం హైదరాబాద్ నుంచి విద్యాశాఖ కార్యదర్శి యోగితా రాణా విద్యా బోధనపై జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. జిల్లా కలెక్టర్ పి. ప్రావిణ్య ఈ వీడియో కాన్ఫరెన్స్‌లో పాల్గొన్నారు.

Similar News

News February 19, 2026

మానవాభివృద్ధిలో AI కీలక మలుపు: మోదీ

image

మానవాభివృద్ధిలో AI కీలక మలుపు అని ఢిల్లీ సమ్మిట్‌లో మోదీ అన్నారు. మనుషులు, టెక్ కలిసి పనిచేసే దశలోకి ప్రవేశిస్తున్నామన్నారు. ఈ విప్లవాన్ని శాసించేందుకు పెద్ద విజన్ అవసరమని పేర్కొన్నారు. ఈ జర్నీలో భారత్ కేవలం భాగంగానే కాకుండా ముందుండి నడిపిస్తోందన్నారు. ఈ కొత్త సాంకేతికత మనుషుల్ని ముడి పదార్థాలుగా మార్చే అవకాశం ఇవ్వొద్దన్నారు. ఏ టెక్నాలజీ అయినా కంట్రోల్‌లో ఉండాలంటూ AI నియంత్రణను ప్రస్తావించారు.

News February 19, 2026

కాజీపేట: శివాజీ జయంతి ఏర్పాట్లలో ఒకరు మృతి.. UPDATE

image

కాజీపేటలో <<19181822>>శివాజీ శోభాయాత్ర ఏర్పాట్లు<<>> చేస్తుండగా కరెంట్ షాక్‌తో ఓ యువకుడు మృతి చెందిన విషయం తెలిసిందే. పోలీసులు తెలిపిన వివరాలు.. దర్గా ప్రాంతానికి చెందిన పోతరబోయిన శివకుమార్, రోహిత్, దినేశ్ ఛత్రపతి శివాజీ జయంతి కోసం ఐరన్ పైపులతో ఏర్పాట్లు చేస్తున్నారు. అవి కరెంట్ వైర్లకు తగలడంతో శివకుమార్(22) అక్కడికక్కడే మృతి చెందాడు. రోహిత్ చేతికి గాయాలవగా.. దినేష్ సురక్షితంగా బయటపడ్డాడని తెలిపారు.

News February 19, 2026

T20 WCలో ఆడనున్న బంగ్లాదేశ్.. ఎప్పుడంటే?

image

టీ20 వరల్డ్ కప్-2028కి అర్హత సాధించిన 12 జట్ల పేర్లను ICC ప్రకటించింది. ఈ లిస్టులో భారత్, NZ, AUS, PAK, శ్రీలంక, SA, AFG, ENG, ఐర్లాండ్, WI, ZIM, బంగ్లాదేశ్ ఉన్నాయి. WC-26లో సూపర్-8కి వెళ్లిన 8 జట్లు, 2028 WC హోస్ట్ నేషన్స్ (AUS, NZ)తో పాటు టీ20 ర్యాంకింగ్స్ ఆధారంగా 3 జట్లను (AFG, BAN, IRE) తీసుకున్నట్లు వివరించింది. మరో 8 జట్లు క్వాలిఫయర్ మ్యాచుల ద్వారా ఎంపిక కానున్నాయి.