News March 5, 2025

హనుమకొండ: నేడే పరీక్షలు.. ALL THE BEST

image

హనుమకొండ జిల్లా వ్యాప్తంగా 39,980 మంది విద్యార్థులు నేడు ఇంటర్ పరీక్ష రాయనున్నారు. ఫస్టియర్ 19,543, సెకండియర్‌లో 20,437 మంది విద్యార్థులు రాయనుండగా.. 55 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశారు. పరీక్షల నేపథ్యంలో ట్రాఫిక్ పోలీసులు అప్రమత్తంగా ఉండాలని, బీఎన్ఎన్ఎస్ 163(144) చట్టం అమలులో ఉంటుందని సీపీ అంబర్ కిషోర్ ఘూ తెలిపారు. కాగా, పరీక్షకు 30 నిమిషాలకు ముందే పరీక్ష కేంద్రానికి చేరుకోండి.
ALL THE BEST

Similar News

News December 11, 2025

రోహిత్ గొప్ప హృదయానికి అది నిదర్శనం: జైస్వాల్

image

సౌతాఫ్రికాతో ఇటీవల భారత్ ఆడిన మూడో వన్డేలో యశస్వి జైస్వాల్ తన కెరీర్‌లోనే తొలి సెంచరీ చేసిన విషయం తెలిసిందే. అయితే క్రీజులో కుదురుకునేందుకు ఆయన చాలా ఇబ్బంది పడ్డారు. ఈ క్రమంలో మరో ఎండ్‌లో ఉన్న రోహిత్ తనతో మాట్లాడుతూ భరోసా ఇచ్చినట్లు జైస్వాల్ తెలిపారు. ‘నేను రిస్క్ తీసుకుంటా. నువ్వు ప్రశాంతంగా టైం తీసుకొని ఆడు’ అని తనతో చెప్పినట్లు వివరించారు. ఇది తన గొప్ప హృదయానికి నిదర్శనం అని కొనియాడారు.

News December 11, 2025

15న నెల్లూరులో భారీ ర్యాలీ: కాకాణి

image

నెల్లూరులో ఈనెల 15వ తేదీన వైసీపీ ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించనున్నట్లు మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి ప్రకటించారు. సర్వేపల్లిలో బుధవారం ఆయన మీడియాతో మాట్లాడారు. కూటమి ప్రభుత్వం రాష్ట్రంలో 17మెడికల్ కాలేజీలను ప్రైవేట్‌పరం చేస్తున్నందుకు నిరసనగా తమ పార్టీ కోటి సంతకాల సేకరణ చేసిందన్నారు. అన్ని చోట్లా సేకరించిన సంతకాలను 15న జిల్లా కార్యాలయానికి చేరుస్తామన్నారు.

News December 11, 2025

అలా తిట్టడం వల్లే ‘రాజా సాబ్’ తీశా: మారుతి

image

నెగిటివ్ కామెంట్స్ పెట్టేవాళ్లు, తిట్టేవాళ్లకి చాలా థాంక్స్ అని డైరెక్టర్ మారుతి అన్నారు. అలాంటి వారు లేకపోతే తాను ‘రాజా సాబ్’ తీసేవాడిని కాదని తెలిపారు. వారంతా తమ పనులన్నీ మానుకొని, పాజిటివిటీని చంపుకొని మరొకరి కోసం టైం పెడుతున్నారని సెటైరికల్ కామెంట్స్ చేశారు. తమలోని నెగిటివిటీని వారు పంచుతున్నారని, అదంత ఈజీ కాదన్నారు. ఎవరైనా తిడితే ఎనర్జీగా మార్చుకొని ముందుకెళ్లాలని ఓ ఈవెంట్‌లో సూచించారు.